Pawan Kalyan Fires On Mohan Babu: మీకు ఏదో రోజు మూడుతుంది.. మాట్లాడు అంటూ పవన్ కల్యాణ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల మూసివేత, ప్రభుత్వం టికెట్లు అమ్మే అంశాలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ మాట్లాడుతూ ఎన్నడూ లేనంతగా ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ఏపీ మంత్రులు, ప్రభుత్వ అవినీతి, పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్ రాజు, హరీష్ శంకర్, దేవకట్టా తదితరులు హాజరైన వేడుకలో ఆద్యంతం సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఏపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారంటే..

మోహన్ బాబు.. మీరు నోరు విప్పండి అంటూ

మోహన్ బాబు.. మీరు నోరు విప్పండి అంటూ

సినిమా థియేటర్ల మూసివేత వివాదంపై నటుడు మోహన్ బాబు మాట్లాడాలి. వైఎస్ కుటుంబీకులు మీకు బంధువులు. కాబట్టి ఆయనకు సభాముఖంగా ఓ విన్నపం చేస్తున్నాను. సినీ పరిశ్రమను హింసించ వద్దని చెప్పండి. కావాలంటే పవన్ కల్యాణ్‌ను బ్యాన్ చేయమని చెప్పండి. మీరు మాజీ రాజ్యసభ సభ్యులు. మీకు నైతిక బాధ్యత ఉంది. సినిమా పరిశ్రమ గురించి మాట్లాడాలి. ఈ రోజు సినిమాపై పరిశ్రమపై పెట్టిన ఆంక్షలు రేపు మీ విద్యాసంస్థలపై కూడా పెట్టడానికి అవకాశం ఉంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఏపీ ప్రభుత్వ ఖజానా డొల్ల

ఏపీ ప్రభుత్వ ఖజానా డొల్ల

సినిమా టికెట్లను ఏపీ ప్రభుత్వం ఎందుకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నదంటే.. వారి ఖజానాలో డబ్బులు లేవు. చిత్ర పరిశ్రమ ద్వారా వచ్చిన సంపదను ప్రభుత్వ ఖజానాలోకి వెళితే.. ప్రభుత్వం ఆ ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి రుణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇసుక, బూమ్ బూమ్ అంటూ అమ్ముకొంటూ ప్రభుత్వం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొంటున్నారు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ప్రెసిడెంట్ మెడల్, గ్యాలంటరీ అవార్డు కావాలా?

ప్రెసిడెంట్ మెడల్, గ్యాలంటరీ అవార్డు కావాలా?

ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. మీకు ప్రెసిడెంట్ మెడల్, గ్యాలంటరీ అవార్డు కావాలంటే సులభంగా తీసుకోవచ్చు. మీరు ఏమి చేయనక్కర్లేదు. బ్రాందీ షాపు వెళ్లి ప్రెసిడెంట్ మెడల్, గ్యాలంటరీ అవార్డు తెచ్చుకోవచ్చు. మీ పథకాల కోసం ఇతరుల నుంచి ట్యాక్సులు వసూలు చేయాలనుకోవడం దారుణం. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అంటూ వైఎస్ జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

వైసీపీ నేతకు లక్ష కోట్ల ఆస్తి అంటూ..

వైసీపీ నేతకు లక్ష కోట్ల ఆస్తి అంటూ..

థియేటర్ల ఓపెనింగ్ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం ఖాయం. అలాంటి పరిస్థితిని ప్రశ్నించడానికి భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. చిరంజీవికి కూడా ప్రాధేయపడవద్దు అని చెప్పండి. బావ, బావ.. సోదర సోదరా అంటే లాభం లేదు. దేశ సినీ పరిశ్రమ ఆదాయం పదివేల కోట్లు.. ఓ వైసీపీ నేత ఆస్తి లక్ష కోట్లు అంటున్నారు.

రాజకీయ నేతలు కూడా ట్యాక్సులు కట్టరు. అలాంటి వారిని ప్రతీ ఒక్కరు ప్రశ్నించాలి. ఒకవేళ వైసీపీ వాళ్లకు ఒక్కటే హెచ్చరిక.. సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ తీరు మారకపోతే ఏం చేయాలో మాకు బాగా తెలుసు. తెలుగు సినిమా పరిశ్రమను ఎవరు అడ్డుకోలేదు జాగ్రత్త.. జైహింద్ అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X