»   » జాతీయగీతం ఇష్యూ : పవన్ కళ్యాణ్ ట్వీట్ సరైందే అని భావిస్తున్నారా?

జాతీయగీతం ఇష్యూ : పవన్ కళ్యాణ్ ట్వీట్ సరైందే అని భావిస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జాతీయ గీతం సమయంలో తెరపై త్రివర్ణపతాకం ఎగురుతూ ఉండాలని, ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయగీతం ప్లే చేయాలని చేసిన కోర్టు ఆదేశాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

భోపాల్ కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా అమలవుతోంది.

మిశ్రమ స్పందన

మిశ్రమ స్పందన

అయితే నిర్ణయంపై.... కొందరు ఏకీభవిస్తుండగా, మరికొందరు నటులు మరో రకంగా స్పందిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని నటుడు అరవింద స్వామి ఆ మధ్య తన అభిప్రాయం వ్యక్తం చేయగా. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అరవింద స్వామి

అరవింద స్వామి

అసలు థియేటర్లో సినిమాకి ముందు జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలో ఎవరైనా వివరిస్తారా? ఎక్కడైనా దేశానికి ప్రాతినిధ్యం వహించే చోట.. లేదా వేలమంది గుమిగూడేఒక క్రీడా సంబంధిత ఈవెంట్లోనో జాతీయగీతం పాడించడం అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ థియేటర్లలో వందల మందిని లోపల బ్లాక్ చేసి ఎగ్జిట్లు మూసేసి జాతీయ గీతం పాడించడమేంటో అర్థం కావడం లేదు. ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తే బాగుంటుంది. 1997 లో ఉపహార్ థియేటర్లలో ఎగ్జిట్లు లాక్ చేయడం వల్ల జరిగిన దుర్ఘటనను ఈ సందర్భంలో ఓసారి గుర్తు చేసుకోవాలి'' అని అరవింద్ స్వామి తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

ఇపుడు పవన్ కళ్యాణ్

ఇపుడు పవన్ కళ్యాణ్

కుటుంబం, స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వస్తే అది దేశభక్తికి పరీక్షా కేంద్రం కావొద్దని పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. కుల మత విభేదాలు లేకుండా విలువలతో కూడిన మానవ సంబంధాలే దేశభక్తికి నిజమైన అర్థమన్నారు.

మీ అభిప్రాయ ఏమిటి?

మీ అభిప్రాయ ఏమిటి?

థియేటర్లలో జాతీయ గీతం అనే అంశంపై అరవింద స్వామి, పవన్ కళ్యాణ్ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. మరి వీరి అభిప్రాయాలతో మీరు ఏకీ భవిస్తారా?... దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో వెల్లడించండి.

English summary
Pawan Kalyan questioned as to whom he should prove his patriotism and why film theatres are turned into a testing ground for testing one's love for the country.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu