ఇంట్రస్టింగ్ : తప్పుకున్న రాజశేఖర్, ఫర్వాలేదన్న పవన్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రంలో హీరో రాజశేఖర్‌పై సెటైరిక్ సన్నివేశం పెట్టిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ కూడా మహంకాళి సినిమాలో పవన్ కళ్యాణ్‌పై రివేంజ్ సీన్ ప్లాన్ చేసాడు. వీరి మధ్య ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం వెనక మెగా వర్గానికి, జీవిత రాజశేఖర్ వర్గానికి మధ్య చాలా కాలంగా విబేధాలు ఉండటమే అనేది అందరికీ తెలిసిందే.
చిరంజీవిపైనా, పవన్ కళ్యాణ్‌పైనా గతంలో జీవితరాజశేఖర్ వివిధ కారణాలతో మీడియా మీటింగులు పెట్టి మరీ ఓ రేంజిలో విమర్శలు చేసారు. ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్-రాజశేఖర్ ఒకే చోట తారస పడటం....షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం చర్చనీయాంశం అయింది.
గోపీంచంద్ వివాహం సందర్భంగా ఆదివారం రాత్రి ఈ ఇద్దరు వేడుకకు హాజరయ్యారు. తొలుత జీవితరాజశేఖర్ గోపీచంద్‌ను కలిసి విష్ చేయగా, ఆయన వెనకనే పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో రాజశేఖర్ పక్కకు జరిగి రమ్మంటూ పవన్‌ను ఆహ్వానించడం, ఏం ఫర్వాలేదు మీరు కానివ్వండి అంటూ పవన్ సిగ్నల్స్ ఇవ్వడం, ఆ తర్వాత ఇద్దరు చేతులు కలపడం హాట్ టాపిక్ అయింది.

పక్కకు జరిగి పవన్‌ను రమ్మంటున్న రాజశేఖర్, ఫర్వాలేదని సిగ్నల్ ఇస్తున్న పవన్

గోపీచంద్ వెడ్డింగ్ రిసెప్షన్లో పవన్ కళ్యాణ్, రాజశేఖర్


Click it and Unblock the Notifications











