హాట్ టాపిక్ : పవన్, చరణ్, బన్నీ మల్టీ స్టారర్

By Bojja Kumar

హైదరాబాద్ : టాలీవుడ్లో మళ్లీ మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకుంటున్న తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ మూవీ(పవన్-చరణ్-బన్నీ) భవిష్యత్‌లో వచ్చే అవకాశాలున్నాయనే సంకేతాలు ఇచ్చారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ..'బాబాయ్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌‌తో కలిసి ఓ మంచి సినిమాలో నటించాలని ఉంది. ముగ్గురికీ నచ్చే విధంగా స్క్రిప్టు దొరికితే తప్పకుండా చేస్తాం. అయితే ఇప్పుడు ఆప్రత్నాలు ఏమీ చేయడం లేదు. ఇప్పుడే చేయాలనే తొందర కూడా లేదు' అని వ్యాఖ్యానించారు.

రామ్ చరణ్ వ్యాఖ్యలపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మెగా హీరోలు కలిసి చేస్తే చూడాలని తమకూ.... ఉందని మనసులోని మాటను బయట పెడుతున్నారు కొందరు ఫ్యాన్స్. వీలైనంత త్వరగా మెగా అభిమానుల కోరిక కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' షూటింగులో బిజీగా ఉండగా, రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం షూటింగులో ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రాలపై దృష్టి సారించారు. ఇద్దరమ్మాయిలతో చిత్రం తర్వాత 'రేసుగుర్రం' అనే చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు బన్నీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X