»   » రామ్ చరణ్ సినిమాతో...ఆ అపోహ తొలగిపోతుందా?

రామ్ చరణ్ సినిమాతో...ఆ అపోహ తొలగిపోతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చాలా కాలంగా తెలుగటు ఇండస్ట్రీలో ఓ అపోహ నెలకొంది. తెలుగులో టాప్ డైరెక్టర్లయిన రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు తీరు కాస్త భిన్నంగా ఉంటుందని....రాజమౌళితో పని చేసిన హీరోలతో త్రివిక్రమ్ చేయడని, త్రివిక్రమ్‌తో చేసిన వారితో రాజమౌళి సినిమాలు చేయడని చాలా మంది నమ్ముతుంటారు.

రాజమౌళి ఇప్పటికు ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్లతో సినిమాలు చేసారు. అయితే వీరిలో ఎవరూ కూడా త్రివిక్రమ్ తో చేయలేదు. అదే సమయంలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో చేసారు. వీరెవరూ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేయలేదు. అయితే ఇది కాకతాళీయంగా జరిగిందే కానీ కావాలని చేసింది కాదని మరొకొందరి వాదన.

Pawan Kalyan, Ram Charan, Trivikram movie

త్వరలో రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే పై అపోహ తొలగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సొంత బేనర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట.

ప్రస్తుతం రామ్ చరణ్ శ్రీను వైట్లతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు పూర్తయిన తర్వాత రామ్ చరణ్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయడంపై రామ్ చరణ్ స్పందిస్తూ...‘అవును నిజమే! కళ్యాణ్ బాబాయ్ తన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఫస్ట్ ప్రాజెక్టులో నేను భాగటం కావడం మరింత ఆనందంగా ఉంది. లవ్ యూ బాబాయ్' అని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? అనే విషయం మాత్రం రామ్ చరణ్ వెల్లడించలేదు.
I

English summary
If the reports are to be believed, Ram Charan will be working with Trivikram soon and it is the film, which Pawan Kalyan is going to produce.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu