నలుగురు హీరోయిన్లతో పవన్ కళ్యాణ్ రేవ్ పార్టీ!
హైదరాబాద్ : పవన్ కళ్యాన్ ఏమిటి? రేవ్ పార్టీల్లో పాల్గొనడటం ఏమిటి? అని షాకయ్యారు. అయితే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ రేవ్ పార్టీ సాంగ్‌ను ప్లాన్ చేసారు. 'ఇట్స్ టైం టు పార్టీ' అనే లిరిక్ తో సాగే ఈ పాట మాంచి జోష్ తో కూడుకుని కుర్రకారులో హుషారును రేకెత్తించేలా ఉంటుంది.
అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాల స్థలంలో ఈ పాట చిత్రీకరణ జరుగనుంది. దేవిశ్రీ ప్రసాద్ దీన్ని తదనై స్టైల్‌లో కంపోజ్ చేసారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ పాటలో పవన్‌తో పాటు సమంత, హంసా నందిని, ఖుషీ సినిమా ఫేం ముంతాజ్‌లు స్టెప్పులు వేయనున్నారు. గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సాంగు చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టులో తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'


Click it and Unblock the Notifications












