మెగా అభిమానులకు గుడ్ న్యూస్: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయం.. హింటిచ్చిన థమన్

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయబాట పట్టిన ఆయన.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన ట్వీట్ చూసి ఇదే పవన్ రీ ఎంట్రీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అని ఫిక్సయ్యారంతా. ఇంతకీ తమన్ ట్వీట్ ఏంటి? అందులో ఏముంది? వివరాల్లోకి పోతే..

'పింక్' రీమేక్.. థమన్ క్లారిటీ

'పింక్' రీమేక్.. థమన్ క్లారిటీ

'పింక్' సినిమా రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే అని కన్ఫర్మ్ చేస్తూ ఓ హింట్ ఇచ్చారు థమన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో ఈ వార్త మెగా అభిమానుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘పింక్' సినిమాను అదే పేరుతో రీమేక్ చేయబోతున్నట్లు థమన్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయం.. థమన్ హింట్

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయం.. థమన్ హింట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 40వ ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, దిల్ రాజుతో కలిసి తాను మూడోసారి ఈ సినిమా కోసం పని చేస్తున్నానని థమన్ తెలిపారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు ఇది ఓ పెద్ద హీరోతో తన బిగ్ జర్నీ అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ గురించిన ఓ హింట్ ఇచ్చాడు థమన్.

మెగా ఫ్యాన్స్ ఫిక్స్.. పవన్ సినిమాకు ఫస్ట్‌టైమ్

ఈ సినిమా కోసం థమన్ ఇప్పటికే ఓ రాకింగ్ ట్యూన్‌ని కంపోజ్ చేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటున్న థమన్ పవన్ కళ్యాణ్ సినిమాకు మొదటిసారి ట్యూన్స్ అందించబోతున్నారు కాబట్టి థియేటర్స్ మోతమోగి పోవడం ఖాయమే అని ఫిక్స్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.

Recommended Video

Pawan Kalyan Launched Ee Manase Song From MisMatch
థమన్ మెస్మరైజ్.. అంతకుమించిన రేంజ్

థమన్ మెస్మరైజ్.. అంతకుమించిన రేంజ్

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘అల వైకుంఠపురములో' సినిమాకు థమన్ అందించిన బాణీలు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెస్మరైజ్ చేస్తున్నాయో చూస్తున్నాం. మ్యూజిక్ పరంగా గత రికార్డులను చెరిపేస్తూ హంగామా చేస్తోంది 'అల వైకుంఠపురములో'. సో పవన్ సినిమాకు కూడా అంతకుమించిన రేంజ్ మ్యూజిక్ ఇస్తారని భావిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X