శిల్పకళావేదికకు చేరుకున్న పవన్ కల్యాణ్.. ఊగిపోయిన మెగా ఫ్యాన్స్

మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారమే భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారు.

మెగా అభిమానులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే చాలా మంది శిల్పకళావేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో హైటెక్ సిటీ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. అదే సమయంలో ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. ఈ ఫంక్షన్ వల్ల హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా ఉంది. వాస్తవానికి ఉదయం నుంచే చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పాసుల కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. చివరకు పాసులు దక్కించుకుని వేడుకకు చేరుకుంటున్నారు.

Pawan kalyan Reach Chiranjeevi Birthday Function

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పేర్కొన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం శిల్పకళావేదికకు చేరుకున్నారు. ఆడిటోరియంలోకి ఆయన ఎంటర్ అవగానే.. మెగా అభిమానులు అందరూ పవర్ స్టార్.. పవర్‌ స్టార్ అంటూ నాన్ స్టాప్‌గా నినాదాలు చేశారు. అంతేకాదు, జై జనసేన జై జనసేన అని కూడా గోల చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీ జెండాలు చూపిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన వచ్చిన వెంటనే అల్లు అరవింద్‌ను కౌగిలించుకున్నారు. అంతకంటే ముందు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా ఆడిటోరియంకు చేరుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X