»   » ‘కంచె’ టీజర్ చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

‘కంచె’ టీజర్ చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే రోజు వరుణ్ తేజ్ కంచె ఫస్ట్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ కి ఫోన్ చేసి మెచ్చుకున్నాడట. మంచి కథ ఎంచుకున్నందుకు వరుణ్ తేజ్‌ని అభినందించాడట. కీప్ ఇట్ అప్ అని బాబాయ్ వెన్ను తట్టడంతో వరుణ్ తేజ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

కంచె సినిమాలో... ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. జార్జియా దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను వాడుకుని, భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Pawan Kalyan reaction about Kanche teaser

ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా చిత్ర బృందం విడుదల చేసింది. సుమారు 45 సెకండ్ల రన్ టైం ఉన్న ఈ టీజర్ కు సోషల్ మీడియా లో అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి గారి పోలిక లో ఉండటం ఫాన్స్ ని ఎంతో ఎక్సైట్ చేస్తోంది.

బాలీవుడ్ లో ఇటివలే ‘గబ్బర్' చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

English summary
Pawan Kalyan reaction about Varun Tej's Kanche teaser.
Please Wait while comments are loading...