twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ పవన్ అస్వస్ధత

    By Staff
    |

    Pawan Kalyan
    యువరాజ్యం అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. బి ఆర్ స్టేడియం వద్ద ప్రసంగించేందుకు వెళుతూ దారిలో అస్వస్ధతకు గురయ్యారు. ఆయన శ్వస తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటనే వాహనంలో విజయవాడకు తరలించారు. అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించినట్లు సమాచారం. ఇక పవన్ ఇలా మాటిమాటికి అస్వస్ధతకు గురిఅవ్వటం అబిమానులును తీవ్రస్ధాయిలో నిరాసపరుస్తోంది.

    ఇంతకు ముందు కూడా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ కళ్లు తిరిగి కింద పడిపోయారు. నగరంలోని అంబర్ పేట సభలో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనను పార్టీ కార్యకర్తలు హుటాహుటిన సికిందరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వడదెబ్బతో పాటు లో బిపి కారణంగా పవన్ అస్వస్థతకు గురయ్యారని, చికిత్స జరపిపాక ఇంటికి పంపిస్తామని, కొద్ది గంటలపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. అస్వస్థత కారణంగా హైదరాబాద్ నగరంలో పవన్ కల్యాణ్ పాల్గనవలసిన సభలను రద్దు చేసాయి.

    అలాగే ఈ సమయంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నిర్మాతల మండలి అధ్యక్ష్యుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ప్రకటనను సిని పరిశ్రమవారు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కి ఏక్సిడెంట్ అయిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ప్రచారానికి వెళ్ళిన ఆర్టిస్టులకు జరగరానిది జరిగితే వారిపై ఆధారపడిన నిర్మాతల పరిస్ధితి ఏం కావాలని తమ్మారెడ్డి భరధ్వాజ ప్రశ్నించారు. అందుకోసం ఇటీవల టీడిపి ప్రచారానికి వెళ్ళి రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ఉదంతాన్ని ప్రస్ధావించారు. ఇది పులి చిత్రం పూర్తి చేయాల్సిన పనవ్ కీ వర్తిస్తుందంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X