విచిత్రమైన టైటిల్ రిజస్టర్ చేయించిన పవన్ కళ్యాణ్
జానీ సినిమా దగ్గర నుంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్‌ను ప్రోత్సహిస్తూ తన సొంత బేనర్లో అవకాశం కల్పించాలనుకున్న పవన్ జానీ సినిమా బిగ్ ప్లాప్ కావడంతో తన ఐడియాలను తాత్కాలికంగా ఆగి పోయాయి. తాజాగా పవన్ కళ్యాన్‌కు చెందిన ఈ సంస్థ పేరున ఓ విచిత్రమైన టైటిల్ ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ అయింది.
'కో...బలి'(నరుకు.. బలి) అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే దీని అర్థం ఏమిటో పూర్తి గా అర్థం కాక పోయినా..... విచిత్రంగా, ఆసక్తి కరంగా ఉండటంతో ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది.


Click it and Unblock the Notifications












