twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరకు అది కూడా...పవన్ వద్దకు వచ్చి వెళ్లిందేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రిజెక్టు చేసిన చాలా సినిమాలు ఇతర హీరోలు ఒప్పుకుని హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. సినిమాల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుందో? తెలియదు కానీ ఆయా హిట్ సినిమాలను చూసినపుడు ఆయన ఎందుకు రిజెక్టు చేసారో అర్థం కాక అభిమానులు అయోమయంలో పడుతుంటారు. ఇడియటర్, పోకిరి లాంటి సినిమాలు అలాంటివే.

    తాజాగా మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానాను హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన సినిమా అంతుకు ముందే పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిందట. ఆ కథను పవన్ రిజెక్టు చేయడంతో రానాతో చేసారు. ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల స్వయంగా వెల్లడించారు. ఆ సినిమా బాక్సాపీసు వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక పోయినా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల సక్కిల్ లోనూ సినిమా బావుందనే టాక్ వచ్చింది. అదే సినిమా పవన్ కళ్యాణ్ తీస్తే భారీ కలెక్షన్ల వసూలు చేసి ఉండేదేమో?

    ఆ సంగతి పక్కనపెడితే పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. సో....కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమా కావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. జనవరి 10న ‘గోపాల గోపాల' చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Pawan Kalyan Rejects Leader Movie

    విడుదల తేదీ ఖరారు కావడంతో ‘గోపాల గోపాల' మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమెరికాలో ప్రీమియర్ షోలు భారీ సంఖ్యలో వేస్తున్నారు. యూఎస్ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 100కుపైగా స్క్రీన్లలో విడుదలవుతోంది.

    గోపాల గోపాల బెనిఫిట్ షోలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని బ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో బినిఫిట్ షో ప్లాన్ చేస్తున్నారు. టిక్కెట్లు కూడా అమ్మకానికి రెడీ అయ్యాయి. ఈ రోజు అర్థరాత్రి నుండి తెల్లవారు జాము వరకు పలు చోట్ల షోలు వేస్తున్నారు. బాల్కనీ టికెట్ రేటు రూ. 3 వేల నుండి 5 వేలు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ క్లాస్ టికెట్ రేటు రూ. వెయ్యి నుండి 2 వేలు అంటున్నారు. ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం అన్యాయమని పేద ప్యాన్స్ అంటున్నారు.

    'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

    మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

    English summary
    Sekhar Kammula said that he approached Powerstar with ‘Leader’ script, but Pawan Kalyan has declined it politely. It went on to become the debut film for Rana Daggubati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X