మరణానికి ముందు పవన్‌ కల్యాణ్‌కు గద్దర్ ఆడియో ఫైల్.. అందులో ఏముంది? ఇన్సాటాలో పవర్‌స్టార్ వీడియో వైరల్

ప్రజా యుద్ద నౌక గద్దర్ ఇకలేరనే వార్తతో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతివార్త బయటకు రాగానే హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియానికి వెళ్లి గద్దర్ పార్దీవ దేహానికి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీరు ఆగడం లేదని చెప్పారు. గద్దర్ అంత్యక్రియలు ముగియగానే తన ప్రేమను, ఆవేదనను కవితా రూపంలో వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఇన్స్‌టాలో పోస్టు చేసిన కవితా వివరాల్లోకి ..

ఎల్బీ స్టేడియంలో శ్రద్దాంజలి ఘటించిన అనంతరం.. ప్రతీ సంవత్సరం కొద్ది నెలలు, కొద్ది రోజులు గద్దర్, నేను కూర్చొనే వాళ్లం. గత మూడు సంవత్సరాలుగా కుదరడం లేదు. మొన్న అన్నకు బాగాలేదని తెలిస్తే.. అపోలో హాస్పిటల్‌కు పోయి గద్దర్ అన్నను కలిశాను. ఎన్నోసార్లు మృత్యువుతో పోరాటం చేసిన ఆయన త్వరగా కోలుకొంటాడని అనుకొన్నాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan released a poetic video in instagram on Gaddar

గద్దర్ ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎంతటి దు:ఖాన్నైనా, కన్నీటినైనా గుండెల్లో పెట్టుకోగలను. కానీ ఈ రోజు కావడం లేదు. ఆపరేషన్‌కు గద్దర్ అన్న ఆడియో మెసేజ్ పంపించారు. పీడిత వర్గాల తరఫున పోరాడే వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన అవే విషయాలు ఆడియో ఫైల్‌లో పేర్కొన్నారు అని పవన్ కల్యాణ్ చెప్పారు.

రాజకీయాల్లో చాలా కష్టాలు ఉంటాయి. ఒంటరిగా పోరాటం చేస్తున్నావు జాగ్రత్త అని అంటే.. మీరే నాకు స్పూర్తి అని చెప్పాను. నా అంతిమ లక్ష్యం పీడిత వర్గాలకు మేలు చేయడమే అని చెప్పాను అని పవన్ కల్యాణ్ తెలిపారు.

గద్దర్ అంత్యక్రియల ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను పోస్టు చేశారు. తనలోని భావోద్వేగాన్ని కవిత రూపంలో విన్నవించుకొన్నారు. పవన్ కల్యాణ్ రిలీజ్ చేసిన వీడియో వివరాల్లోకి వెళితే..

బీటలు వారిన ఎండలో
సమ్మెట కొట్టే కూలీకి గొడుగు గద్దర్
తాండా పాండాలో చలిపులిని బెదిరించే నెగడు గద్దర్
పీడిత జనుల పాట గద్దర్
అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్
అడివిలో ఆకు చెప్పిన కథ.. గద్దర్
కోయిల పాడిన కావ్యం గద్దర్
గుండెకు గొంతొస్తే.. బాధకు భాషస్తే.. అది గద్దర్
అన్నింటికి మంచి నా అన్న గద్దర్
అన్నా..ఓ గాయపడ్డ పాటవి
కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవు
అన్యాయంపై తిరగబడిన పాటవు
ఇదివరకు నీవు ధ్వనించే పాటవి
ఇప్పుడు కొన్ని లక్షల పాటల్లోప్రతి ధ్వనించే పాటవి
తీరం చేరిన ప్రజా యుద్ధ నౌకకు జోహార్.. జోహార్.. జోహార్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X