Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
లాభాల్లో పవన్ కళ్యాణ్‌కు వాటా ఇస్తే తప్పేంటి?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని, ఇక నుంచి ఆయన లాభాల్లో వాటా తీసుకోవాలని డిసైడ్ అయ్యాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఇలాంటి ప్రతిపాదనపై కొందరు నిర్మాతలు సంతృప్తిగానే ఉన్నా....ఈ ఆనవాయితీ కొందరు ప్రొడ్యూసర్లకు మాత్రం రుచించడం లేదు. అయితే లాభాల్లో వాటా అనే ప్రతిపాదన ఎంతో ఆరోగ్యకరమైనదని, దీని వల్ల నిర్మాతలకు మంచే కలుగుతుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
పవన్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు అంటే భారీ బడ్జెట్ తప్పదు. అంత ఖర్చు పెట్టి సినిమా ఆడక పోతే నిర్మాతకు భారీ నష్టం తప్పదు. లాభాల్లో వాటా ప్రతిపాదన వల్ల సినిమా నిర్మాతకు మేలు కలుగుతుందని....లాభ నష్టాల ఆధారంగానే హీరోకు చెల్లింపులు జరుగుతాయిన కాబట్టి రిస్క్ అనేది ఉండదు అంటున్నారు చాలా మంది.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అయితే భవిష్యత్‌లో పవర్ స్టార్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం ఉంది.