»   »  పవన్-రేణు దేశాయ్‌కి పార్టీ టైం: షాపింగ్ చేస్తున్నారు!

పవన్-రేణు దేశాయ్‌కి పార్టీ టైం: షాపింగ్ చేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు విన్నది నిజమే.... పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణుదేశాయ్‌కి ఇపుడు పార్టీ టైం. ఇద్దరూ కలిసి సోమవారం జరిగే ఓ పార్టీలో సంతోషంగా గడప బోతున్నారు. ఆల్రెడీ విడిపోయిన ఇద్దరూ కలవడం ఏమిటి, పార్టీ చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా?..... భార్య భర్తలుగా విడిపోయినా వీరు తల్లిదండ్రులుగా తమ బాధ్యత నిర్వర్తించాలి కదా! అందుకే ఇదంతా...

అసలు విషయంలోకి వెళితే.... పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ ముద్దుల కూతురు ఆద్యా సోమవారం 5వ పుట్టినరోజు జరుపుకోబోతోంది. రేణు దేశాయ్ తన కూతురు కోసం చిన్నపాటి పార్టీ హోస్ట్ చేస్తున్నారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan-Renu Desai daughter turns 5 on Monday

తన ముద్దుల కూతురు బర్త్ డే గురించి రేణు దేశాయ్ వివరిస్తూ...‘బర్త్ డే గర్ల్ సోమవారం 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఆద్యతో కలిసి షాపింగ్ వెళ్లాను. బర్త్ డే కోసం స్పెషల్ డ్రెస్ తీసుకున్నాను' అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు. బర్త్ పార్టీ భారీగా ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘బర్త్ డే పార్టీ పెద్దగా ఏమీ చేయడం లేదు. ఇంట్లోనే చిన్నగా ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లు లేని వారికి అన్నదానం చేయాలనుకుంటున్నాం' అన్నారు.

పవన్ కళ్యాణ్ తన తన ముద్దుల కూతురు బర్త్ డే కోసం గిఫ్టు కొనే ఉంటాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తన పిల్లలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్నిపవన్ కళ్యాణ్ మిస్ కారు. ఆ మధ్య ఆద్య చదువుతున్న స్కూలుకు వెళ్లి స్వయంగా కూతురు డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసారు పవన్ కళ్యాణ్.

English summary
Pawan Kalyan-Renu Desai daughter turns 5 on Monday. Renu took to Twitter and posted "And the Bday girl turns 5 on Monday...out for Bday shopping with Aadya...Dress done now gifts time." Asked if Renu Desai is planning for a big bash Renu replied, "I don't host big Bday parties...small ones at home itself & donate food for the homeless:)."
Please Wait while comments are loading...