For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భార్య రేణుతో పవన్ కళ్యాణ్ (అరుదైన ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే పవన్ మీదే మీడియా దృష్టి ఉంటుంది. అప్పుడప్పుడూ అరుదుగా మాత్రమే ఇంటర్వూలు ఇచ్చే ఆయన పర్శనల్ జీవితంపైనా అందరికీ ఆసక్తే. అయితే ఆయన ఎప్పుడూ తన పర్శనల్ లైఫ్ గురించి పబ్లిక్ లో మాట్లాడలేదు. మీడియాలో ఆయన వైవాహిక జీవితం టాపిక్ గా మారినా ఎప్పుడూ స్పందించలేదు.

  మొదటి భార్యతో విడాకులు తీసుకుని,రేణుని వివాహం చేసుకున్నప్పుడు సైతం మీడియా విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చింది. ప్రత్యేకమైన కథనాలు ప్రసారం చేసింది. 1997 మేలో నందిని ని వివాహం చేసుకున్న ఆయన తర్వాత రేణుతో చాలా కాలం పాటు సహజీవనం చేసారు. ఆ తర్వాత నందినితో విడాకుల తర్వాత అఫిషియల్ గా వివాహం చేసుకున్నారు.

  జానితో అంటే 2003లో పవన్,రేణు దేశైల అనుబంధం మొదలైందని చెప్పవచ్చు. అంతకుముందు వీరిద్దరూ బద్రి చిత్రంలో చేసారు. ఆ తర్వాత గుడుంబా శంకర్,బాలు,అన్నవరం చిత్రాలుకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసారు. ప్రజారాజ్యం పార్టిని చిరంజీవి లాంచ్ చేసాక పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు రాకుండా ఉండేందుకు కానూ ఆయన వివాహం చేసుకున్నారంటారు.

  పవన్ కళ్యాణ్ మొదటి భార్యను దూరంగా ఉంచి రేణూ దేశాయ్‌తో సహజీవనం సాగిస్తూ వచ్చారు. మొదటి భార్య వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించే క్రమంలో మొదటి భార్యతో విడాకులకు పవన్ కళ్యాణ్ చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ రేణూ దేశాయ్‌తో పవన్ కళ్యాణ్ విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  ఆయన వైవాహిక జీవిత మిగతా విశేషాలు ఫోటోలతో...స్లైడ్ షోలో...

  2008లో పవన్ మాజీ భార్య నందిని..ఆయనపై కేసు పుటప్ చేసారు. అందులో తాను లీగల్ గా భార్యని ఉండగా పవన్ మరో ఆమెను రెండవ వివాహం చేసుకున్నారని అభియోగం ఉంది. అప్పటికి ఇంకా డైవర్స్ తీసుకోలేదు.

  కానీ ఛీఫ్ మెట్రో పాలిటన్ జడ్జి కె.కృష్ణ మూర్తి ...సరైన సాక్ష్యం లేనందున ఆ కేసు కొట్టివేసారు.

  ఆ తర్వాత పవన్ మొదటి భార్యతో కొంత సెటిల్ మెంట్ చేసుకుని విడాకులు తీసుకున్నారు. అప్పటికే ఆయన తన క్లోజ్ గర్లెప్రెండ్ రేణుతో సహ జీవనం చేస్తున్నారు.

  2009లో పవన్ ..అఫీషియల్ గా రేణుని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు పుట్టారు. 2011 లో వీరిద్దరూ విడిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి.

  తర్వాత మెగా ఫ్యామిలీ వీరిద్దరుని కలపటానికి ప్రయత్నించారని టాక్. రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో అలాంటి ప్రయత్నాలు జరిగాయంటారు.

  తర్వాత రేణు దేశై తో నలభై కోట్లు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకున్నారని,వివాహం రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఎవరూ ధృవీకరించలేదు.

  రేణూ ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలను పెట్టుకుని..పూనేలో ఉంటుందని, పిల్లలు హైదరాబాద్, పూనే మధ్యన షటిల్ చేస్తున్నారని వినికిడి.

  తర్వాత పవన్ కళ్యాణ్ ..తీన్ మార్ కో స్టార్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అభిమానలు సైతం ఈ వార్తలపై మండిపడ్డారు.

  రేణు,పవన్ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చాయని, అయితే అవి త్వరలో సమిసిపోతాయని,సంసారంలో ఇవి కామనే అని కొందరు పవన్ వర్గీయులు చెప్తున్నారు.

  పవన్ విషయంలో ఆయన ప్రెవేట్ లైఫ్ పై ఎన్ని రూమర్స్ ఉన్నా..ఎప్పుడూ వాటిని ఖండిచనూ లేదు..వాటి గురించి మాట్లాడనూ లేదు. ప్రెవేట్ లైఫ్..ప్రెవేట్ గా ఉండాలనే పద్దితి ఆయనలో కనపడుతుంది.

  English summary
  Pawan Kalyan is one Telugu actor, who has always maintained a safe distance from the media. He has hardly given interviews to any newspaper or movie portal or TV channel. Although he has never spoken about his private life in public, his martial life has become a big topic of debate for the media. Especially in recent times, his hookup and breakup with actress Renu Desai has created lot of stir. Continue to read more details about Pawan Kalyan's martial life and also see his rare pictures with Renu Desai in slide show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X