twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ తనయుడు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ వాళ్ల అమ్మ రేణు దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇష్క్ వాలా లవ్' అనే మారఠీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కాబోతోంది. తాజాగా అకీరా నందన్ తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ రికార్డింగుకు సంబంధించిన పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ట్విట్టర్లో రేణు దేశాయ్ ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

     Pawan Kalyan-Renu Desai's Son Akira Nandan Dubbing For Debut Film

    పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద ‘శ్రీ ఆద్య ఫిలింస్' అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించింది. ఇప్పటికే ‘మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్నారు రేణు దేశాయ్.

    తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. అయితే తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం. అకీరా నందన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు.

    English summary
    Recently, Renu Desai had announced that Power Star Pawan Kalyan's son Akira Nandan would make his acting debut as child through her latest directorial venture Ishq Wala Love. Now, the actress-turned-filmmaker says that he is dubbing for the Marathi movie. Meanwhile, she also says that her team is working on the recording of the Telugu version of the Marathi movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X