మహేష్ నుంచి సంపూ వరకు, ఎవ్వరిని వదిలిపెట్టని పవన్ కళ్యాణ్.. ఇంతకంటే ఏం కావాలి!

పవన్ కళ్యాణ్ గత పుట్టినరోజుల ఎలా జరిగాయి అనే విషయాన్ని పక్కనపెడితే.. అంతకు మించిన హై రేంజ్ లో నిన్న జరిగిన బర్త్ డే అభిమానులకి ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పవచ్చు. బహిరంగ వేడుకలు జరగలేదు గాని సోషల్ మీడియాలో అయితే పవన్ పేరు మారు మ్రోగిపోయింది. పవన్ కి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో విషెస్ అందించడం ఇరు వర్గాల అభిమానులకు ఒక మంచి కిక్కిచ్చింది.

గతంలో కంటే ఎక్కువ విషెస్

గతంలో కంటే ఎక్కువ విషెస్

పవన్ కళ్యాణ్ కి దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రముఖుల నుంచి విశేస్ అందాయి. కేంద్ర మంత్రుల రాష్ట్ర మంత్రులు అలాగే పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు కూడా వారి విషెస్ అంధించారు. సాధారణంగా పవన్ తన పుట్టినరోజును పెద్దగా పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటాడు. కానీ ఈ సారి మాత్రం గతంలో కంటే ఎక్కువ విషెస్ అందడం వలన స్టార్స్ లో బేధం చూపకుండా ఎవ్వరిని వడలపెట్టకుండా సమాధానం ఇచ్చారు.

మహేష్ ట్వీట్ హైలెట్..

మహేష్ ట్వీట్ హైలెట్..

ఈ సారి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అంధించడం అభిమానులకు ఒక మంచి కిక్కిచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే కెరీర్ మొదటి నుంచి మహేష్ బాబుకు ఒక మంచి స్నేహం భావం ఉంది. ఇక నిన్న పుట్టినరోజు మహేష్ స్పెషల్ గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలుపడంతో ఆ ట్వీట్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్ బాబు చేసిన ట్వీట్స్ లలో అత్యదిక లైక్స్ పొందిన ట్వీట్ గా అదే నిలిచింది.

మహేష్ కి రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్..

మహేష్ కి రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్..

మీ విషెస్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మహేష్ బాబు గారు. మీకు కూడా మంచి జరగాలని నేను విష్ చేస్తున్నాను అని పవన్ చాలా కూల్ గా మహేష్ బాబు ట్వీట్ కి రిప్లై ఇవ్వడంతో అభిమానుల్లో ఒక్కసారిగా మరో కొత్త జోష్ మొదలైంది. మహేష్ ఒక్క ట్వీట్ కి 152K లైక్స్, 58.3K రీట్వీట్స్ వచ్చాయి అంటే అభిమానులు ఏ స్థాయిలో సంబరపడ్డారో అర్థం చేసుకోవచ్చు.

మహేష్ నుంచి సంపూ వరకు..

మహేష్ నుంచి సంపూ వరకు..

పవన్ కళ్యాణ్ సమాధానాలు ఇవ్వడంలో ఏ మాత్రం అలసట చూపలేదు. మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజున శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికి పవన్ ప్రత్యేకంగా వివరణ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది.

అన్నయ్యతో మొదలు పెట్టి..

అన్నయ్యతో మొదలు పెట్టి..

మొదట రాజకీయ నేతల విషెస్ కి సమాధానం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత టాలీవుడ్ సినీ ప్రముఖుల విషెస్ కి సమాధానం ఇస్తూ వచ్చాడు. జీవితంలో అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు ... హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ మెగాస్టార్ తో మొదలు పెట్టారు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
స్టార్స్ అందరికి కృతజ్ఞతలు

స్టార్స్ అందరికి కృతజ్ఞతలు

ఆ తరువాత వెంకటేష్, మోహన్ లాల్, సుధీర్ బాబు, సునీల్, నాని, మంచు మనోజ్, సత్యదేవ్, రవి తేజ, వరుణ్ తేజ్, కిచ్చా సుదీప్, రామ్ పోతినేని, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, కోన వెంకట్, బోణి కపూర్, ఎస్ జె.సూర్య చివరికి సంపూర్ణేష్ బాబు లాంటి చిన్న నటుడికి కూడా పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X