»   » పవన్ కళ్యాణ్ ఇంట్లో విషాదం అంటూ రూమర్స్... మేనేజర్ స్పందన!

పవన్ కళ్యాణ్ ఇంట్లో విషాదం అంటూ రూమర్స్... మేనేజర్ స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి యూట్యూబ్‌లో దారుణమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఇంట్లో విషాదం నెలకొందని, పవన్ కళ్యాణ్ అత్తగారు చనిపోయారంటూ కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ ప్రతినిధులు స్పందించారు.

అన్నా లెజెనివా తల్లి చనిపోయిందంటూ...

అన్నా లెజెనివా తల్లి చనిపోయిందంటూ...

ఎవరు క్రియేట్ చేశారో? ఎలా ప్రచారంలోకి వచ్చాయో? తెలియదు కానీ.... పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా తల్లి చనిపోయిందని, ఆమె మరణంతో పవన్ కళ్యాణ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

కొన్ని ఛానల్స్ అత్యుత్సాహం

కొన్ని ఛానల్స్ అత్యుత్సాహం

కొన్ని యూట్యూబ్ చానల్స్ మరింత అత్యుత్సాహం ప్రదర్శించి... అన్నా లెజెనివా తల్లి మరణంపై వపన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా స్పందించారని, తన సంతాపం తెలియజేశారు అంటూ ప్రచారం చేశాయి.

Renu Desai Gives Strong Counter To Pawan Kalyan Fans
ఖండించిన మేనేజర్

ఖండించిన మేనేజర్

అయితే ఈ వార్తలను పవన్ కళ్యాణ్ ప్రతినిధులు ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

ఇలాంటి ప్రచారం వద్దు

ఇలాంటి ప్రచారం వద్దు

ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయవద్దని, ఇలాంటి పుకార్లు మీ దృష్టికి వస్తే ఒకటికి రెండు సార్లు కన్‌ఫర్మ్ చేసుకోవాలని..... అధికారిక సమాచారం ఉంటేనే పబ్లిష్ చేయాలని పవన్ కళ్యాణ్ మేనేజర్ రిక్వెస్ట్ చేశారు.

English summary
Pawan Kalyan’s media managers have refuted the viral rumours that his mother in law has passed away.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu