ఒక క్షణం కూడా ఆలోచించనన్న రాంచరణ్.. పదిసార్లు ఆలోచించాలి అంటూ పవన్ సలహా!

సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరమైన మెగాస్టార్ చిరు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా హీరోగా అదరగొడుతున్నాడు. పవన్ కళ్యాణ్,రాంచరణ్ మధ్య ఎప్పుడూ ప్రేమాభిమానాలు ఉంటాయి. రంగస్థలం ప్రీరిలీజ్ ఈవెంట్ లో అది కాస్త ఎక్కువగా బయటపడింది. ఇటీవల రాంచరణ్ మీడియా ప్రశ్నకు బదులిస్తూ జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి నేను రెడీ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తాజగా స్పందించారు.

పెరిగిన చరణ్ బ్రాండ్ వాల్యూ

పెరిగిన చరణ్ బ్రాండ్ వాల్యూ

హ్యాపీ మొబైల్స్ కు రాంచరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. చాలా కాలం తరువాత మరోమారు చరణ్ కార్పొరేట్ సంస్థలకు ఎండార్స్ మెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రం తరువాత చరణ్ బ్రాండ్ వాల్యూ పెరిగింది.

ఒక్క క్షణం కూడా ఆలోచించను

ఒక్క క్షణం కూడా ఆలోచించను

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు రాంచరణ్ బదులిచ్చాడు. జనసేన పార్టీకి ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాంచరణ్ తెలిపాడు. బాబాయ్ పిలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రచారం చేస్తానని చరణ్ తెలిపాడు.

పవన్ కళ్యాణ్ స్పందన

పవన్ కళ్యాణ్ స్పందన

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాంచరణ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను చేయాల్సింది చేసుకుంటూ వెళతా అని, ప్రత్యేకంగా ఎవరినీ పిలవనని పవన్ అన్నారు. తన కుటుంబం అయినా సరే ఇష్టపడి రావాలని అన్నారు. వారు ఇష్టపడి వచ్చినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని రమ్మంటానని పవన్ అన్నారు.

సంతోషకరమైన జీవితం

సంతోషకరమైన జీవితం

తన ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని, ఇప్పుడెందుకు అనిపిస్తుందని పవన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X