twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan : ఒక్క ట్వీట్, ఒక్క పాటతో పెను విధ్వంసం.. ఆ సమయం ఆసన్నమయిందంటూ!

    |

    రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కలకలం రేపుతూనే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి రెండు మూడు రోజులు కావస్తున్నా దానికి సంబంధించి ఇప్పటికీ మాటల తూటాలు పేలుతూనే ఉండటం సంచలనంగా మారింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శల వర్షం కురిపించారు. అలాగే పొద్దు పోయాక పోసాని కృష్ణ మురళి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అనేక సంచలన విమర్శలు చేయడమే కాక ఎవరూ ఊహించని ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు..

    అయితే ఇంత జరుగుతున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం నేరుగా స్పందించకపోయినా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన చేసిన ఒక ట్వీట్ అలాగే ట్వీట్ చేసిన ఒక పాట ఇప్పుడు వైసీపీ విమర్శలకు చెక్ పెట్టినట్లు అయింది.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఏమని ట్వీట్ చేశారు అనే వివరాల్లోకి వెళితే

    పవన్ కామెంట్స్ తో కలకలం

    పవన్ కామెంట్స్ తో కలకలం

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా గురించి పెద్దగా ప్రస్తావించలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.

    ముఖ్యంగా టిక్కెట్లు రేట్ల విషయంలో అలాగే టికెట్లను ఆన్లైన్లో అమ్మడం విషయంలో చాలా సీరియస్ అయ్యారు. పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపించడంతో ఆ తర్వాతి రోజు ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు సైతం వరుస బెట్టి ప్రెస్ మీట్ లు పెడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.

    పవన్ ను టార్గేట్ చేస్తు

    పవన్ ను టార్గేట్ చేస్తు

    ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు వంటి వాళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సినిమా ఫంక్షన్ లో సినిమాలు మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడారు అనేది ప్రధాన ఆరోపణగా వీరి విమర్శలు సాగాయి.

    అయితే నిన్న సాయంత్రం అనూహ్యంగా పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. అనేక సంచలన విమర్శలు చేయడమే కాక పంజాబీ అమ్మాయి అనే విషయాన్ని కూడా లేవనెత్తారు. అయితే పోసాని కృష్ణ మురళి, మీడియా సమావేశం ముగించిన కాసేపటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి

    కుక్కలని బయటికి ఎవరు వదిలారు ?

    కుక్కలని బయటికి ఎవరు వదిలారు ?

    ''తుమ్మెదల ఝుంకారాలు, నెమలి క్రీంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, అలాగే వైసీపీ గ్రామసింహాల గోంకారాలు'' సహజమైన అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే వైసిపి కుక్కలు అంటూ ఎవరిని సంబోధించారు అనేది క్లారిటీ లేకపోయినా ఆయన తనను విమర్శించిన వారిని సంప్రదించగలరు అని ఫ్యాన్స్ భావిస్తూ పవర్ స్టార్ట్ వీటిని వైరల్ చేశారు.

    ఆ కొద్ది సేపటికి ఆయన మరో పాట ఒక దానిని ట్వీట్ చేసి ఇది నా ఫేవరెట్ సాంగ్ అని పేర్కొన్నారు. అయితే ఇది ఒక అమెరికన్ పాప్ సాంగ్. 'who let the dogs out', అంటే కుక్కలని బయటికి ఎవరు వదిలారు అంటూ సాగి పోయే ఈ పాట తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కొన్నేళ్ళ క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చినా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమాలో సైతం ఈ పాటను సిద్ధార్థ పాడతాడు.

    మళ్ళీ కౌంటర్

    మళ్ళీ కౌంటర్

    ఆ సినిమాలో త్రిష, సిద్ధార్థ ఒక బాత్ రూంలో చిక్కుకుని పోగా ఒక కుక్క వారిద్దరిని నిలువరిస్తుంది, ఆ సందర్భంలో సిద్ధార్థ ఇదే పాట పాడతాడు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత వైసీపీ నుంచి నేరుగా ఎవరూ స్పందించలేదు గానీ మంత్రి పేర్ని నాని మాత్రం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. ''జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న'మస్కా'రాలు'' అంటూ ట్వీట్ చేశారు. అయితే కొద్ది సేపటి క్రితం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మళ్ళి వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం'కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి అని దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

    Recommended Video

    Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || FIlmibeat Telugu
    పవన్ వ్యక్తిగతం అంటూ

    పవన్ వ్యక్తిగతం అంటూ

    అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెత్తనం వద్దని అంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సినీ పెద్దలు టిక్కెట్లు అమ్మాలని కోరారని అంటోంది. ఇక ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఇండస్ట్రీకి సంబంధం లేదని ఆయన మాట్లాడిన మాటలు పూర్తిగా వ్యక్తిగతమని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సంపూర్ణేష్ బాబు హీరో నాని హీరో కార్తికేయ లు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు.

    English summary
    Pawan kalyan responds to ycp leaders with who let the dogs out song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X