పవన్ తిరిగి ఇచ్చేస్తున్నాడంట.. ప్రధాని గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరికి షాక్..
Recommended Video

జనసేన అధినేత హోదాలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తెలంగాణలో తన పర్యటనను అట్టహాసంగా ప్రారంభించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఇక రాజకీయాలపైనే పవన్ దృష్టి సారించనున్నారనేది ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతున్నది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు సినిమాలు చేస్తారన్న వార్తలకు ఇక కాలం చెల్లినట్టే కనిపిస్తున్నది. ముందస్తు అంగీకారం

ఏఎం రత్నంతో సినిమా
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత నిర్మాత ఏఎం రత్నం సారథ్యంలో రూపొందే చిత్రంలో పవన్ నటించాల్సి ఉంది. ఆ సినిమాకు చరిత్ర అనే టైటిల్ కూడా పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం కోసం తమిళ దర్శకుడు నీసన్ కథను కూడా సిద్దం చేసినట్టు తెలిసింది.

మైత్రీ మూవీస్‌తో చిత్రం
ఇక ఏఎం రత్నం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాణ సారథ్యంలో సంతోష్ శ్రీనివాస్ దర్వకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రం తమిళ సినిమాకు రీమేక్‌గా రూపొందనున్నదనేది టాక్. ఈ చిత్రమే ముందుగా సెట్స్‌పైకి వెలుతుందని ఈ మధ్య ఓ వార్త మీడియాలో షికారు చేసింది.

ఇక సినిమాలు చేయను..
అయితే తెలంగాణ నుంచి రాజకీయ పర్యటనలు ఊపందుకొన్న నేపథ్యంలో పార్టీని మరింత విస్తృత పరిచే ఆలోచనతో పవన్ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారట. అందుకే సినిమాలకు ఇక స్వస్తి అనే మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది.

అడ్వాన్సు వాపస్ ఇచ్చేందుకు..
ఇలాంటి పరిస్థితుల్లో ఏఎం రత్నం, మైత్రీ మూవీస్ నిర్మాతల నుంచి తీసుకొన్న అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఎదురైతే తర్వాత వాటిని సర్దుబాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు తెలిసింది.

జనసేనపైనే దృష్టి
సినిమాలక తాత్కాలికంగా గ్యాప్ ఇచ్చి జనసేన పార్టీని పటిష్ఠం చేయనున్నారట. జనసేన పార్టీ పటిష్ఠత కోసం విరాళాలు, ఫండ్స్ సేకరించేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట.

డిసెంబర్‌లోనే ఎన్నికలకు సిద్ధం
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది చివర్లోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్రమోదీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు పవన్‌కు కేంద్రం నుంచి సంకేతాలు అందడంతో జనసేన పార్టీ కార్యక్రమాలను అనూహ్యంగా ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











