For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం, అందరితో పడుకుంటారు అని .. ఖుషి ముందు రోజు పవన్ జాతకం!

  |

  ఖుషి విడుదల ముందురోజే నాకు ఆ విషయం తెలిసిపోయింది అంటున్న పవన్ కళ్యాణ్.. నీ బాడీ పార్ట్స్ అంటే ఇష్టం అని చెప్పిన ఆకతాయికి తాప్సి అదిరిపోయే కౌంటర్.. స్నేహితులే విశాల్ కు వెన్నుపోటు పొడిచిన వైనం.. త్రివిక్రమ్ మాటతో ఎన్టీఆర్ ఆగిపోయాడు... అందరితో పడుకుంటారు అనే మాట బాధించింది అంటున్న కలర్స్ స్వాతి.. చేత్తో ఆమె నోటిని మూసేసిన బాలయ్య.. సునీల్ పొడిచేస్తాడు అన్నారు ఇప్పుడేం జరిగింది అంటున్న పృథ్వీ.. ఇలాంటి హాట్ న్యూస్ ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి. ఆ వివరాలు మీ కోసం!

   ఖుషి రిలీజ్ ముందురోజు నా జాతకం తెలిసిపోయింది.. చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే!

  ఖుషి రిలీజ్ ముందురోజు నా జాతకం తెలిసిపోయింది.. చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై పూర్తి దృష్టి కేటాయించి రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రవాస ఆంధ్రులతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. డల్లాస్ లో జరిగిన ప్రవాస గర్జన సభలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సినీ రాజకీయ అంశాలని ప్రస్తావిస్తూ తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలని వివరించారు. దశాబ్దకాలం పాటు సరైన విజయం లేకపోవడంతో కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందులని పవన్ కళ్యాణ్ వివరించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   'నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం'.. నాకైతే అదే.. ఆకతాయికి తాప్సి దిమ్మతిరిగేలా!

  'నా బాడీలో ఏ పార్ట్ అంటే ఇష్టం'.. నాకైతే అదే.. ఆకతాయికి తాప్సి దిమ్మతిరిగేలా!

  పలు సందర్భాల్లో హీరోయిన్లు నెటిజన్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని పట్టించుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం పట్టించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పలు సందర్భాల్లో హీరోయిన్ తాప్సి సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురైంది. ప్రతి సారి తనని విమర్శించే వారికీ తాప్సి ధీటుగా సమాధానం ఇస్తోంది. తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా తాప్సి గురించి అసభ్యంగా కామెంట్ చేశాడు. అతడికి తాప్సి దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడంతో అభిమానులు తాప్సిని ప్రశంసిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరో విశాల్‌కు స్నేహితుల వెన్నుపోటు.. భారీ ఎదురుదెబ్బ!

  హీరో విశాల్‌కు స్నేహితుల వెన్నుపోటు.. భారీ ఎదురుదెబ్బ!

  విశాల్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగువారికి కూడా బాగా చేరువయ్యాడు. విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అన్ని కార్యక్రమాల్లో విశాల్ చురుకుగా పాల్గొంటుండడం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు, సినిమాలు, సేవ కార్యకమాలు ఇలా ప్రతి చోటా విశాల్ ప్రమేయం ఉంటుంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘంలో విశాలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. నడిగర్ సంఘం ఎప్పుడూ ఎదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూనే ఉంది. నడిగర్ సంఘం నిర్మాతల మండలికి విశాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరో మారు నడిగర్ సంఘంలోని లుకలుకలు బయట పడ్డాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  త్రివిక్రమ్ మాటతో ఆగిపోయిన ఎన్టీఆర్.. విలువైన సలహా!

  త్రివిక్రమ్ మాటతో ఆగిపోయిన ఎన్టీఆర్.. విలువైన సలహా!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా నటించిన అరవింద సమేత చిత్రం మంచి విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాక్షన్ డ్రామా మాస్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా అరవింద సమేత నిలిచింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ స్నేహితులుగా మారిపోయారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ చాలా తక్కువ మందితో స్నేహంగా ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా త్రివిక్రమ్ ఆప్త మిత్రుడిగా మారిపోయారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం విషయంలో నందమూరి కుటుంబం గురించి ఆసక్తికర చర్చ జరిగింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ రామారావు ఏంటి.. కృష్ణుడు ఏంటి.. నిన్ను అందరూ దేవుడు అంటున్నారు బావ!

  ఆ రామారావు ఏంటి.. కృష్ణుడు ఏంటి.. నిన్ను అందరూ దేవుడు అంటున్నారు బావ!

  మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల చేతుల మీదుగా ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ లాంచ్ జరిగింది. అద్భుతంగా ఉన్న ట్రైలర్ లోని విశేషాలు ఇప్పుడు చూద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  2018 బాక్సాఫీస్ రిపోర్ట్: వసూళ్లలో టాప్ సినిమాలు ఇవే, టాలీవుడ్ ఆధిపత్యం!

  2018 బాక్సాఫీస్ రిపోర్ట్: వసూళ్లలో టాప్ సినిమాలు ఇవే, టాలీవుడ్ ఆధిపత్యం!

  2018 సంవత్సరం చివరన రిలీజైనా వసూళ్ల పరంగా ఈ ఏడాది విడుదలైన అన్ని సౌత్ సినిమాను దాటేసింది రజనీకాంత్ 2.0. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే అందుకుందని చెప్పక తప్పదు. అయితే టాప్ 20 సినిమా లిస్ట్ తీసుకుంటే అందులో మన తెలుగు సినిమాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరి ఈ సంవత్సరం సౌత్‌లో వచ్చిన టాప్ సినిమాలే ఏమిటి? ఎంత బడ్జెట్‌తో రూపొందాయి? ఎంత వసూలు చేశాయి అనే విషయాలై ఓ లుక్కేద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వైరల్ అవుతున్న జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోస్... ఆవిడ వచ్చింది అందుకేనా?

  వైరల్ అవుతున్న జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోస్... ఆవిడ వచ్చింది అందుకేనా?

  యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతితో పాటు ప్రముఖ ఫస్ట్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన జర్సా కూడా ఉండటం గమనార్హం. ఓ ముఖ్యమైన పని నిమిత్తమే ఆమెను పిలిపించినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లూజ్ క్యారెక్టర్... అందరితో పడుకుంటారనే మాట బాధించింది, మహేష్ బాబు చాలా విట్టీ: స్వాతి

  లూజ్ క్యారెక్టర్... అందరితో పడుకుంటారనే మాట బాధించింది, మహేష్ బాబు చాలా విట్టీ: స్వాతి

  రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న నెం.1 యారి కార్యక్రమానికి ఇటీవల తన కోస్టార్ నిఖిల్‌తో కలిసి హాజరైంది తెలుగు హీరోయిన్ స్వాతి. ఈ సందర్భంగా నిఖిల్, స్వాతి నుంచి రానా పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. ఇద్దరూ ఏ మాత్రం మొహమాట పడకుండా కొన్ని విషయాలపై ధైర్యంగా నోరు విప్పారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మేమంతా ఓ గ్యాంగ్, చిరంజీవి టార్గెట్ మరోలా ఉండేది, ఆయనలో అదే మైనస్!

  మేమంతా ఓ గ్యాంగ్, చిరంజీవి టార్గెట్ మరోలా ఉండేది, ఆయనలో అదే మైనస్!

  చెన్నై వెళ్లి సినిమాల్లో ప్రయత్నిస్తున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్, ప్రసాద్ బాబు చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్ వారు నారాయణరావును కలిసి ముచ్చటించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లైవ్: జమున ఆ మాట అనగానే.. చేత్తో ఆమె నోటిని మూసేసిన బాలయ్య!

  ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లైవ్: జమున ఆ మాట అనగానే.. చేత్తో ఆమె నోటిని మూసేసిన బాలయ్య!

  మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఇండియన్ ప్రియుడు దొరకలేదా?.. అందుకేనా విదేశీ భర్త.. శృతిహాసన్‌కు నెటిజన్ల ఝలక్!

  ఇండియన్ ప్రియుడు దొరకలేదా?.. అందుకేనా విదేశీ భర్త.. శృతిహాసన్‌కు నెటిజన్ల ఝలక్!

  అందాల తార శృతిహాసన్ సినిమా రంగాన్ని వదిలేసినట్టే కనిపిస్తున్నది. ప్రస్తుతం తమిళ టెలివిజన్‌లో హోస్ట్‌గా వ్యవహరించడం తప్పితే పెద్దగా చేస్తున్నదేమీ లేదు. కానీ ఈ రోజుల్లో శృతి బిజీగానే కనిపిస్తున్నది. ఎందుకంటే లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో బిజీగా గడుపుతుండటమే అందుకు కారణం. తాజాగా శృతిహాసన్ పోస్ట్ చేసిన ఫొటో, కామెంట్ వైరల్‌గా మారింది. అంతేకాకుండా శృతిహాసన్‌ను కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో దూషించడం కూడా కనిపించింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా ఫేవరేట్ హీరో బాలకృష్ణ.. చిరంజీవిని మళ్లీ కెలికిన తమ్మారెడ్డి.. పవన్ అలా మొండిపట్టు..

  నా ఫేవరేట్ హీరో బాలకృష్ణ.. చిరంజీవిని మళ్లీ కెలికిన తమ్మారెడ్డి.. పవన్ అలా మొండిపట్టు..

  దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలిసిందే. తాను ఫీలైన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా వెల్లడిస్తుంటారు. ఇటీవల ప్రముఖ హాస్య నటుడు అలీ నిర్వహించే కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి మాట్లాడుతూ.. తనకు నచ్చిన హీరో బాలకృష్ణ అని వెల్లడించారు. కానీ చిరంజీవితో తనకు అనుబంధం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో బాలయ్య నచ్చాడని చెప్పారు. బాలకృష్ణ నచ్చడానికి కారణాలు చెబుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కల్యాణ్‌కు అవసరం లేదేమో.. పెదనాన్నతో అన్ని చెప్పుకోలేం కదా.. వరుణ్ తేజ్

  పవన్ కల్యాణ్‌కు అవసరం లేదేమో.. పెదనాన్నతో అన్ని చెప్పుకోలేం కదా.. వరుణ్ తేజ్

  మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 21 రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఫిదా, తొలి ప్రేమ హిట్ల తర్వాత వస్తున్న ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ అంతరిక్షం సినిమా గురించి పలు విషయాలు వెల్లడించారు. వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సునీల్‌ పొడిచేస్తాడన్నారు.. కమెడియన్‌గా కమ్ బ్యాక్ అన్నారు.. ఏం జరిగింది.. పృథ్వీ

  సునీల్‌ పొడిచేస్తాడన్నారు.. కమెడియన్‌గా కమ్ బ్యాక్ అన్నారు.. ఏం జరిగింది.. పృథ్వీ

  కామెడియన్‌గా పృథ్వీ ఓ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తాడు. డైలాగ్ డెలివరీతోనే తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అవకాశం దొరికిందంటే చాలూ తెర మీద చెలరేగిపోవడం పృథ్వీ నైజం. అందుకే అతడిని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ముద్దుగా పిలుచుకొంటారు. తాజాగా తెలుగు తెరను మరోసారి నవ్వులతో నింపడానికి పృథ్వీ సిద్దమయ్యాడు. బ్లఫ్ మాస్టర్ చిత్రంలో ధనశెట్టిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ సినిమా విశేషాలను పంచుకొంటూ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Tapsee sensational reply goes viral. Pawan Kalyan reveals his thoughts before Kushi release
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more