త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎవరికీ తెలియని నిజం.. అందరిని ఆశ్చర్యపరిచిన పవన్ కళ్యాణ్!

Recommended Video

Pawan Kalyan Reveals Interesting Secrets About Trivikram Srinivas | FilmiBeat Telugu

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలని కలుసుకుంటున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన జనసేన పార్టీని ఎన్నికల సమరానికి సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పవన్ రాయలసీమలో పర్యటించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా విద్యార్థులతో సమావేశం అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే విద్యారంగానికి సంబందించిన తాను చేపట్టబోయే పాలసీలని వివరించారు. ఈ సంధర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 విద్యా విధానం

విద్యా విధానం

పవన్ కళ్యాణ్ విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే విధానాలు అనుసరించడం లేదని పవన్ అన్నారు. జ్ఞానాన్ని అందించలేని విద్య అనవసరం అని పవన్ తెలిపారు. విద్యార్థులు కూడా తమకు ఉన్నా జ్ఞానంతో సంతృప్తి చెందకుండా ప్రతి రోజు కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఈ ప్రపంచంలో అంతా తెలిసినవారు ఎవ్వరూ లేరని పవన్ తెలిపారు.

 త్రివిక్రమ్ అందరికీ డైరెక్టర్‌గానే

త్రివిక్రమ్ అందరికీ డైరెక్టర్‌గానే

విద్యార్థులు ఎంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నా ఒదిగి ఉండాలని సూచించారు. నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీ అందరికి సినిమా దర్శకుడిగానే తెలుసు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా అరుదైన ఉన్నత విద్యని అభ్యసించారు అని పవన్ తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అనే విషయాన్ని విద్యార్థులకు తెలిపాడు. త్రివిక్రమ్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్న విద్యార్థులు ఆశ్చర్యపోయారు.

మాటల మాంత్రికుడిగా

మాటల మాంత్రికుడిగా

రచయితగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడిగా పేరుగాంచారు. పదునైన డైలాగులు, కామెడీ పంచులు రాయడంలో త్రివిక్రమ్ శైలి అద్భుతం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు. నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ పలు విజయవంతమైన చిత్రాలని తెరకెక్కించారు.

హిట్ కాంబినేషన్

హిట్ కాంబినేషన్

టాలీవుడ్ లో పవన్, త్రివిక్రమ్ లది హిట్ కాంబినేషన్ అనే గుర్తింపు ఉంది. వీరి కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది లాంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ చివరగా డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి చిత్రం మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X