Ram Charan అనే పేరు ఎందుకు పెట్టామంటే.. ఆ కథేంటో చెప్పిన పవన్ కళ్యాణ్..

Ram Charan- Pawan Kalyan: గోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, శంకర్ (Director Shankar) దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ (Game changer). ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. గేమ్ చేంజర్ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా మారింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ తరుణంలో రామ్ చరణ్ కు ఆ పేరు పెట్టడం గల కారణమేంటో? ఆ ప్లాష్ బ్యాక్ ఏంటో.. పవన్ కళ్యాణ్ చెప్పారు.

రామ్ చరణ్- శంకర్ కాంబో మూవీ గేమ్ చేంజర్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించగా.. అంజలి,ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌,సునీల్‌ కీలకపాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌ తో నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. విడుదలకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. అబ్బాయి సినిమాకు బాబాయ్ గెస్ట్ గా రావడంతో మెగా ఫ్యాన్స్ తో ఈవెంట్ హోరెత్తింది.

Pawan Kalyan reveals story behind Ram Charan name in Game Changer Pre Release Event

గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పలు విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు. సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రిమియర్ షోల అనుమతి, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, చిరంజీవి నట ప్రస్థానం,డైరెక్టర్ శంకర్ సినిమాల గురించి ఇలా చాలా విషయాలను మాట్లాడారు. ఈ సమయంలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చరణ్ పేరు వెనక కథ, చరణ్ భక్తి గురించి మాట్లాడారు.

చరణ్ పేరు వెనక కథ గురించి చెప్తూ..'రామ్ చరణ్ పుట్టినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా నాన్నగారు.. చరణ్ కు నామకరణం చేశాడు. మేమందరం ఆంజనేయస్వామి భక్తులు. మా ఇంటి దైవం కూడా. ఎంతో బలం ఉండి రాముడు చరణాల దగ్గర ఉండేవాడు ఎవరు హనుమంతుడు, ఆంజనేయస్వామి. రాముని పాద సేవ చేస్తూ నిత్యం వినయ విధేయత తో ఉండేవాడు ఆంజనేయస్వామి. ఎంత ఎత్తు కు ఎదిగిన.. ఎంత శక్తివంతుడైన.. ఎదిగికొద్ది ఒదిగి ఉండే వ్యక్తి ఆంజనేయస్వామి.. ఆ స్వామి లాగా ఉండాలని రామ్ చరణ్ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టే ఉంటాడు' అని పవన్ కళ్యాణ్ తెలియజేశాడు.

'అలాగే చిరంజీవి గారు నాకు అన్నయ్య కాదు.. పితృ సమానులు.. మా వదిన నాకు మాతృమూర్తి. రామ్ చరణ్ ను అన్నయ్య కొడుకు కంటే.. ఓ తమ్ముడుగానే భావిస్తా' అంటూ రామ్ చరణ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్. ' ఏడేళ్ల వయసులోనే హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. హార్స్ రైడింగ్ కు నేనే తీసుకెళ్లే వాన్ని. చరణ్ ఇంగ్లాండ్ కి వెళ్లి డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఏడాదిలో 100 రోజులు అయ్యప్పస్వామి మాల, ఆంజనేయ స్వామి మాలలోనో ఉంటాడు. ఎందుకంటే.. నియంత్రణ ఉండటానికి అని చెప్పేవాడు. చెప్పులు లేకుండానే నడుస్తాడు.రామ్ చరణ్ మా బంగారం, నా తమ్ముడు.. ఎంత ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటాడు. ఇంకా విజయాలు సాధించాలి. బాబాయ్ గా కాదు.. ఓ అన్నగా ఆశీర్వదిస్తున్నాను' అంటూ పవన్ ఎమోషనలయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X