గోపాల గోపాల: తెలుగు మసాలతో, పవన్ పాత్ర పెంచారు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం రేపు గ్రాండ్‌గా విడుదలవుతోంది. హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకీ-పవన్ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.
హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించారు. అయితే హిందీ వెర్షన్ తో పోలిస్తే....తెలుగులో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి ఎక్కుగా ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు పవన్ కళ్యాణ్ పాత్ర ఎంటరవుతుంది. సెకండాప్ మొత్తం సాగుతుంది. ఆయన పాత్ర మొత్తం 50 నిమిషాలపైనే ఉండనుంది.
తెలుగు నేటి విటీకి తగిన విధంగా సినిమాలో చాలా మసాలా యాడ్ చేసారు. హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాలో ముఖ్యంగా కామెడీకి పెద్ద పీఠ వేసారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదం అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో ‘దబాంగ్' చిత్రాన్ని గబ్బర్ సింగ్ పేరుతో తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేసారు. ఆ సినిమా హిట్టయిందంటే కారణం పూర్తిగా తెలుగు నేటివిటీ సీన్లు జోడించడమే. ‘గోపాల గోపాల' విషయంలో కూడా అలాంటి సూత్రమే ఫాలో అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచడమే పరమావధిగా సినిమాను సిద్దం చేసారు.
విడుదల తేదీ ఖరారు కావడంతో ‘గోపాల గోపాల' మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమెరికాలో ప్రీమియర్ షోలు భారీ సంఖ్యలో వేస్తున్నారు. యూఎస్ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 100కుపైగా స్క్రీన్లలో విడుదలవుతోంది.
'గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.


Click it and Unblock the Notifications











