పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ హీరోయిన్ ఆమెనే!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం గత కొన్ని రోజులు క్రితమే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తను స్థాపించిన 'జనసేన' పార్టీకి సంబంధించి విషయాలపై బిజీగా ఉండటంతో షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది.
మరో వైపు ప్రొడక్షన్ టీం సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ చకచకా పూర్తి చేసుకుంటూ వెలుతోంది. గత కొంత కాలంగా ఈచిత్రానికి హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రచన పర్యవేక్షణ సీనియర్ రచయిత సత్యానంద్, క్రియేటివ్ హెడ్ : హరీష్ పాయ్, రచన సహకారం శ్రీధర్ సీపని, కిషోర్ గోపు, ఛాయాగ్రహణం : జయనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఎడిటర్ : గౌతమ్ రాజు, ఆర్ట్ డైరక్టర్ : ఆనంద్ సాయి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : రాజేష్, ప్రొడక్షన్ కంట్రోలర్ : సి భాస్కర రాజు, నిర్మాత : శరత్ మరార్.
దీంతో పాటు పవన్ కళ్యాణ్ ఓ మల్టీ స్టారర్ చిత్రానికి కూడా డేట్స్ కేటాయించారు. హిందీ హిట్ మూవీ 'ఓ మై గాడ్'ని తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











