ఇద్దరు భామల మధ్య పవన్ కళ్యాణ్ స్టిల్స్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్..!

By Sindhu

మహేష్ దూకుడు తరువాత ఇప్పుడు టాలీవుడ్ చూపు అంతా పవన్ కళ్యాణ్ పంజా పైనే పడింది. రాబోయే రెండు నెలల్లో స్టార్ హీరోల సినిమాల నుంచి చోటా హీరోల సినిమాల వరకు చాలానే ఉన్నాయి. కాని పవన్ పంజా మీద టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. దూకుడు తరువాత బిజినెస్ విషయంలోనూ ట్రేడ్ వర్గాలు అంతగా ఆసక్తి చూపిస్తున్న సినిమా పంజానే..

పవన్ కళ్యాణ్ నటిస్తున్న స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "పంజా". తమిళంలో బిల్లా వంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన విదను వర్ధన్ తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. సంఘ మిత్ర ఆర్ట్స్, ఆర్కామేదియా వర్క్స్ సంయుక్త నిర్మాణంలో నీలిమ తిరుమల శెట్టి, శోబు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలతో సినిమా చాలా స్టైలిష్ గా వుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా బిన్నంగా వుంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. నవంబర్ 19న ఆడియో విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ లో సినిమా విడుదల చేయనున్నారు

పవన్ కళ్యాణ్ పంజా విడుదలకి దగ్గరయ్యే కొద్దీ మరింతగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ ప్రణాళిక ప్రకారం చేస్తున్న పబ్లిసిటీ ఈ సినిమాపై అంచనాలని పెంచేస్తోంది. ముందుగా పవన్ సోలో స్టిల్స్, టీజర్స్ రిలీజ్ చేసిన ఈ చిత్ర నిర్మాతలు ఆడియోరిలీజ్ ను పురస్కరించుకొని హీరోయిన్ కాంబినేషన్ తో స్టిల్స్ రివీల్ చేశారు. నవంబర్ 19న విడుదల కానున్న పంజా ఆడియోపోస్టర్ లో ఇద్దరు భామల నడుమ పవన్ కళ్యాణ్ స్టిల్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సారా జేన్, అంజలి లావానియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రొమాంటిక్ యాంగిల్ కి కూడా అధిక ప్రాధాన్యత ఉందట. టైటిల్, పవన్ కళ్యాణ్ లుక్ ని బట్టి ఇది కేవలం సీరియస్ యాక్షన్ సినిమా అనుకునే అవకాశముంది. సినిమా అంతటా పవన్ న్యూ లుక్ మెయింటైన్ చేసినా.... రొమాన్స్ మాత్రం మిస్ కానివ్వట్లేదు. ఈ సినిమాలో ఉండే క్యూట్ లవ్ స్టోరీ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందట. డిసెంబర్ లో విడుదలయ్యే ఈ చిత్రం పవన్ కు పూర్వ వైభవం తెస్తుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X