పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ శుభవార్త.. సినిమా టైటిల్, లోగో రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని ప్రస్తుతం పీఎస్‌పీకేగా అని పిలుస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని ప్రస్తుతం పీఎస్‌పీకేగా అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పేరును, టైటిల్ లోగోను నవంబర్ 7 తేదీన ప్రకటించనున్నారు. ఆ తేదీకి ఏమి విశిష్టత ఉందని ఆలోచిస్తున్నారా? అయితే మీరే చదవండి..

7న టైటిల్ అనౌన్స్‌మెంట్
సినీ రంగంలో మాటల మాంత్రికుడిగా పేరును సంపాదించుకొన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు నవంబర్ 7వ తేదీ. ఆ సందర్భంగా హారికా, హాసిని బ్యానర్ టైటిల్‌ను ప్రకటించనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

పవన్ కల్యాణ్ కెరీర్‌లో 25వ..
పవన్ కల్యాణ్ కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు అనేక టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అజ్ఞాతవాసి, ఇంజినీర్ బాబు, గోపాలకృష్ణుడు అనే పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పీఎస్‌పీకే25 టీజర్ వైరల్
పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేసిన పీఎస్‌పీకే25 టీజర్‌కు యూట్యూబ్‌లో అనూహ్యమైన రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే ఈ టీజర్ పాటను సుమారు 7 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.

అనిరుధ్ రవిచందర్ సంగీతం
హారికా, హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేశ్, కుష్భూ సుందర్, ఆది పినిశెట్టి నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











