twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియాలోనే గబ్బర్ సింగ్ టాప్.. 24 గంటల్లో సునామీ.. ట్విట్టర్‌ను పవన్ ఫ్యాన్స్ షేక్!

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం 8 ఏళ్ల తర్వాత కూడా దుమ్మురేపింది. సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ చిత్రం గురించి అభిమానులు ట్రెండ్ చేయగా రికార్డు ట్వీట్ సాధించింది. ఇప్పటి వరకు ఇలాంటి రికార్డుపరంగా టాప్‌లో కొనసాగుతున్న పవన్ కల్యాణ్ తన రికార్డును తానే తిరగరాయడం గమనార్హం. ట్విట్టర్‌లో ఇప్పటి వరకు 24 గంటల్లో ట్రెండింగ్‌గా నిలిచి అత్యధిక ట్వీట్లు సాధించిన వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..

    గబ్బర్ సింగ్ పవర్‌స్టార్ బిక్ష.. 8 కాదు.. 80 ఏళ్లైనా.. ప్రత్యేకంగా 'బండ్ల' గణపతి హోమంగబ్బర్ సింగ్ పవర్‌స్టార్ బిక్ష.. 8 కాదు.. 80 ఏళ్లైనా.. ప్రత్యేకంగా 'బండ్ల' గణపతి హోమం

    24 గంటల్లోనే ఎవరూ అందుకోలేని విధంగా

    24 గంటల్లోనే ఎవరూ అందుకోలేని విధంగా

    ట్విట్టర్‌లో ఇటీవల కాలంలో ఇండియా వైడ్ ట్రెండింగ్‌గా నిలిచిన టాప్ 5 ఈవెంట్లను పరిశీలిస్తే.. తాజాగా 8 ఏళ్ల గబ్బర్ సింగ్ రికార్డు సృష్టించింది. 24 గంటల్లోపే ఈ హ్యాష్ ట్యాగ్ 12 మిలియన్లకుపైగా ట్వీట్ సాధించింది. రెండోస్థానంలో హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ఉంది. #HappyBdayPawanKalyan హ్యాష్ ట్యాగ్ 10.51 మిలియన్ల ట్వీట్ సొంతం చేసుకొన్నది.

    నాలుగు, ఐదు స్థానాల్లో..

    నాలుగు, ఐదు స్థానాల్లో..

    ఇక ఆ తర్వాత 14 ఏళ్ల పోకిరి 8.47 మిలియన్ల ట్వీట్స్‌తో మూడో స్థానంలో, నాలుగో స్తానంలో ఎన్టీఆర్ బర్త్ డే ఫెస్ట్ బిగిన్స్ 8.45 మిలియన్ల ట్వీట్స్‌తో నిలిచింది. ఐదో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 8.3 మిలియన్ల ట్వీట్స్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. ఈ పట్టికలో, ఈ గణాంకాల్లో పవన్ కల్యాణ్ టాప్‌ 2 స్థానాల్లో ఉండటం గమనార్హం.

    24 గంటల్లో సునామీ

    24 గంటల్లో సునామీ

    మే 10వ తేది ఆదివారం సాయంత్రం #8YrsOfGabbarSinghHysteria హ్యాష్ ట్యాగ్‌ను అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. గంట గడవక ముందే ఏకంగా 3 మిలియన్ల ట్వీట్స్‌ను నమోదు చేసింది. సోమవారం ఉదయం వరకు 10 మిలియన్లకుపైగా ట్వీట్స్ నమోదు కావడంతో గబ్బర్ సింగ్ ఇండియాలోనే టాప్‌గా నిలిచారు. అంతేకాకుండా ఇంకా ఈ ట్వీట్స్ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దాదాపు 13 మిలియన్లు సాధించే అవకాశం ఉంది.

    దంబంగ్ రీమేక్‌గా

    దంబంగ్ రీమేక్‌గా

    బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన దంబంగ్ హక్కులను కొనుగోలు చేసి నిర్మాత బండ్ల గణేష్ తన సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం 11 మేన 2012న రిలీజైంది. మొదటి ఆట నుంచే రికార్డులు బద్దలు కొడుతూ గబ్బర్ సింగ్ చిత్రం రూ.150 కోట్లు వసూలు చేసి పెట్టింది. పవన్ కల్యాణ్ స్టైల్, హీరోయిజం, దర్శకుడు హరీష్ శంకర్ రచన, మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులకు కిక్కెక్కించాయి. దాంతో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచింది.

    English summary
    Gabbar Singh move has been completed 8 years in Tollywood, On this occassion, Pawan Kalyan movie rocks in Twitter again. As trending on number 1, It reaches 12 milliions tweets in 24 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X