దుమ్ము రేపుతున్న అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ .. సోషల్ మీడియాలో వైరల్
పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ అనే ఉత్కంఠకు తెరపడింది.
Recommended Video

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్ ఏమిటనే ఉత్కంఠకు తెరపడింది. హారిక, హాసిని బ్యానర్‌పై పీ రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అజ్ఞాతవాసిగా ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అజ్ఞాతవాసిగా విస్తృతం ప్రచారంలో ఉంది.

సోఫాలో పవన్ కోపంగా
అజ్ఞాతవాసి ఫస్ట్‌లుక్ పవన్ కల్యాణ్ మేనరిజాన్ని మరోసారి గుర్తు చేసింది. సోఫాలో కూర్చొని చేతిలో ఆఫీస్ ఐడెంటీ కార్డును తిప్పుతూ గుర్రుగా చూస్తున్న పవన్ కల్యాణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా ట్యాగ్ లైన్ ఇదే
అజ్ఞాతవాసి టైటిల్‌కు ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనే ట్యాగ్‌ను పెట్టారు. ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్ర షూటింగ్ వారణాసిలో జరుగుతున్నది. ఈ షూటింగ్ సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు.

ట్విట్టర్‌లో కొత్త అకౌంట్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ కొత్త ఖాతాను తెరిచారు. తన మనసులోని భావాలను, అభిప్రాయాలను ప్రజలు, అభిమానులతో పంచుకునేందుకు పాత అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు.

పీకే క్రియేటివ్ వర్క్స్
ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా @PKCREATIVEWORKZ కొత్త ఖాతా తెరిచారు. ఈ అకౌంట్‌ను పూర్తిగా సినిమాలకు చెందిన విషయాలను వెల్లడించడానికి ఉపయోగించనున్నట్టు ఆయన ప్రకటించారు.

రఘుపతి వెంకయ్య ఫొటో
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అకౌంట్‌కు రఘుపతి వెంకయ్యనాయుడు ఫోటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవడం విశేషం. భారతదేశంలో తొలి మూకీ సినిమాను రూపొందించినది నటరాజ మొదలియార్, రఘుపతి వెంకయ్యనాయుడు అన్న సంగతి తెలిసిందే.

వారణాసి ఒడ్డున పవిత్ర గంగానదిలో..
పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలోని గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పవన్, త్రివిక్రమ్ టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్‌ను ప్రకటించినట్టు తెలిపే విధంగా ల్యాప్‌టాప్‌తో సహా ఫోటోకు పోజిచ్చారు.

కర్ణాటక రికార్డుస్థాయిలో
అజ్ఞాతవాసి కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు రికార్డుస్థాయిలో అమ్ముడపోయాయి. దాదాపు 10.80 కోట్లు చెల్లించి బృందా అసోసియేట్స్ ఈ హక్కులను దక్కించుకొన్నది. నాన్ కన్నడ చిత్రాలకు సంబంధించి ఇదే అత్యుత్తమ రికార్డు అని సినీవర్గాలు చెప్పుకొంటున్నాయి.


Click it and Unblock the Notifications











