అఙ్ఞాతవాసి అక్కడ కూడా రిలీజ్ ?: పవన్ కళ్యాణ్ స్టామినాతోనే కొట్టేస్తారా?

Recommended Video

అఙ్ఞాతవాసి అక్కడ కూడా రిలీజ్ అట !

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లతో పాటు ఇతర భాషల్లో కూడా పవన్ సి9నిమాకోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. పవన్ త్రివిక్రమ్ సినిమా అఙ్ఞాత వాసి కోసం ఇప్పుడు మనోళ్ళే కాదు మలయాళీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. నిజానికి అక్కడికి ప్రవన్ రాక కాస్త ఆలస్యమే అయ్యింది. ఇప్పటికే అక్కడ అల్లు అర్జున్ లోకల్ హీరోలతో సమానమైన మార్కెట్ తెచ్చుకున్నాడు.

మల్లు అర్జున్

మల్లు అర్జున్

అల్లు అర్జున్ ని "మల్లు అర్జున్" అని ప్రేమగా ఓన్ చేసుకున్నారు మళయాలీ అభిమానులు, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రవేశం కూడా జనతా గ్యారేజ్ తో గట్టిగానే జరిగింది... ఆ తర్వాత పవన్‌ని తక్కువగానే చూసిన కేరళ వాసులకు కాటమరాయుడు గట్టి ఇంప్రెషన్ ఇచ్చింది. దాంతో... ఇప్పుడు రాబోయే సినిమా కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు...

 మళయాళ డబ్బింగ్ వెర్షన్

మళయాళ డబ్బింగ్ వెర్షన్

అయితే పవన్ కళ్యాణ్‌‌కి నార్త్ సైడ్ కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అప్పట్లో సినిమాలో ఒక హిందీ సాంగ్ వచ్చేట్టు తప్పకుండా సెట్ చేయించుకునేవాడు. ఇకపోతే కేరళలో కూడా పవర్ స్టార్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళంలో అజ్ఞాతవాసి డైరెక్ట్ గా తెలుగులో ఇంకా వీలైతే మళయాళ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుందట.

అజ్ఞాతవాసి

అజ్ఞాతవాసి

సాధారణంగా పవన్ యాక్షన్ సీన్స్‌ను మలయాళీ సినీ ప్రేమికులు భాషతో సంబంధం లేకుండా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక అజ్ఞాతవాసిలో అలాంటి ఎపిసోడ్స్ కూడా చాలానే ఉన్నాయట. పవన్ కాటమరాయుడుతో కేరళ లో కూడా భారీగానే క్రేజ్ తెచ్చుకున్నాడు .

 కాటమరాయుడు

కాటమరాయుడు

ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా కేరళలోని పలు ప్రాంతాలలో పదర్శింపబడకపోగా, వాటిని కాటమరాయుడు చెరిపేసింది. తొలిసారి త్రిషూర్ మరియు కసర్గాడ్ ప్రాంతాలలో విడుదలైన తెలుగు చిత్రంగా కాటమరాయుడు రికార్డులు క్రియేట్ చేసింది. కొచ్చి మరియు త్రివేండ్రం ప్రాంతాలలోను ఈ సినిమా ప్రదర్శించబడడం విశేషం.

 మరికొన్ని కారణాలు

మరికొన్ని కారణాలు

అందుకే ఇప్పుడు ఆ క్రేజ్ ని ఉపయోగించుకొని పవన్ మార్కెట్ ని అక్కడ కూడా పెచటానికి ప్రయత్నిస్తున్నారట. ఇకపోతే కేరళ అభిమానులు అజ్ఞాతవాసిని ఎక్కువగా ఇష్టపడటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. అనిరుద్ కొలవెరి సాంగ్ అక్కడి వారికి తెగ నచ్చేసింది. దీంతో సంగీత దర్శకుడు అనిరుద్ సినిమాలను వారు చాలా ఇష్టపడతారు.

 కీర్తి సురేష్ - అను ఎమ్మానుయేల్

కీర్తి సురేష్ - అను ఎమ్మానుయేల్

ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మలయాళీ భామలు కీర్తి సురేష్ - అను ఎమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఉండడం వారికి బాగా నచ్చింది. దీంతో నిర్మాతలు మల్లూ గడ్డపై భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2018 జనవరి 10న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X