అజ్ఞాతవాసి ఆ పనికూడా పూర్తయింది.. అక్కడ ఒకరోజు ముందే రిలీజ్
అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే అనేక రకాలుగా రికార్డులు తిరుగరాస్తున్నది. టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్‌లుక్, తాజాగా పవన్ కల్యాణ్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాట సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అజ్ఞాతవాసి సినిమా గురించి రోజుకో ప్రత్యేకత వార్తల్లోకి వస్తున్నది.

అజ్ఞాతవాసి సెన్సార్ పూర్తి
అజ్ఞాతవాసి చిత్రం సెన్సార్ పనులను సోమవారం ముగించుకొన్నది. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు అధికారులు జారీ చేశారు. ఈ చిత్రంపై సెన్సార్ అధికారులు పాజిటివ్‌గా స్పందించినట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఒకరోజు ముందే యూఎస్‌లో
ఇక అజ్ఞాతవాసి సినిమా దేశవ్యాప్తంగా జనవరి 10న రిలీజ్ సిద్ధమవుతుంటే ఓవర్సీస్ మార్కెట్‌లో ఒకరోజు ముందే ప్రీమియర్ ప్రదర్శనలు ఏర్పాటవుతున్నాయి. అమెరికాలో జనవరి 10న ఈ చిత్ర ప్రీమియర్లు ప్రదర్శించనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

పవన్ పాటకు బ్రహ్మరధం
పవన్ కల్యాణ్ పాడిన కొడుకా కోటేశ్వరరావు అనే పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నది. 24 గంటల్లోనే ఈ పాటను యూట్యూబ్‌లో 4,100,780 మంది వీక్షించారు. 268,789 మంది లైక్ చేశారు. 15,890 డిస్ లైక్ చేశారు.

పవన్ సరసన అను, కీర్తి సురేష్
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











