దటీజ్ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్‌స్టార్ స్టామినా తెలిస్తే షాకే..

By Rajababu

Recommended Video

అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్‌స్టార్ స్టామినా తెలిస్తే షాకే..!

అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత పవర్ స్టార్ అభిమానులు కలిగిన షాక్ అంతా ఇంతా కాదు. పవన్ కల్యాణ్ నటన, స్టయిల్ చూసి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. వెరసి సినిమా దారుణంగా ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకొన్నది. అయితే అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సొంత చేసుకొన్న పవర్‌స్టార్ కలెక్షన్ల పవర్ ఏ మాత్రం తగ్గకపోవడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అదేంటో మీరే చూడండి..

తొలి ఆట నుంచే ఫ్లాప్

తొలి ఆట నుంచే ఫ్లాప్

అజ్ఞాతవాసి తొలిరోజు మొదటి ఆట నుంచే దారుణమైన టాక్‌ బయటకు వచ్చింది. అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ప్రివ్యూలు, తొలిరోజు కలెక్షన్లు బాహుబలి2, ఖైదీ నంబర్ 150 వసూళ్లను తిరగరాసింది. తొలిరోజే 1.5 మిలియన్ డాలర్లను అమెరికాలో వసూలు చేయడం ఓ రికార్డుగా చెప్పుకొన్నారు.

 కలెక్షన్లపై ప్రభావం

కలెక్షన్లపై ప్రభావం

ఇక ఫెయిల్యూర్ టాక్ వచ్చిన తర్వాత కూడా అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్లపై అమెరికాలో ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ చిత్రం అమెరికాలో 2 మిలియన్ల క్లబ్‌లో చేరింది. ఈ కలెక్షన్లు ట్రేడ్ అనలిస్టులను నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి.

ప్రత్యేక షోలు నిలిపివేత

ప్రత్యేక షోలు నిలిపివేత

ఇక తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి సినిమా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటికే పలుచోట్లు ప్రత్యేక షోలు నిలిపివేశారు. సినిమాపై సానుకూలత పెంచడానికి డ్యామేజ్ కంట్రోల్‌ చర్యల్లో భాగంగా కొన్ని సీన్లను ఎత్తివేసి మరికొన్ని సీన్లను జోడించారు.

 ప్రేక్షకులను రప్పించడానికి

ప్రేక్షకులను రప్పించడానికి

ప్రేక్షకులను, అభిమానులను మళ్లీ థియేటర్లకు రప్పించడానికి వెంకటేష్‌ నటించిన కొన్ని సన్నివేశాలను జోడించారు. వెంకటేష్ సీన్ల చేర్చిన తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

పవన్ సినిమాపై క్లారిటీ

పవన్ సినిమాపై క్లారిటీ

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత తదుపరి సినిమా ఏమిటనే విషయంపై ఇంకా అధికారికంగా క్లారిటీ లేదు. ఏఎం రత్నంతో చరిత్ర అనే సినిమా చేస్తున్నాడనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది.

 మైత్రి మూవీస్ బ్యానర్లో

మైత్రి మూవీస్ బ్యానర్లో

ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే అజ్ఞాతవాసి సినిమా ఫ్లాఫైన తర్వాత కూడా పవన్ కల్యాణ్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు ఓ వార్త వెబ్ మీడియాలో తిరుగుతున్నది.

పవన్‌కు భారీ రెమ్యునరేషన్

పవన్‌కు భారీ రెమ్యునరేషన్

పవన్ కల్యాణ్‌కు మైత్రీ మూవీస్ సంస్థ రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్టు కథనంలో పేర్కొన్నారు. ఒకవేళ ఆ మొత్తమే కనుక నిజమైతే జాతీయ స్థాయిలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోల్లో పవన్ పేరు మొదటిస్థానంలో ఉంటుంది.

2 మిలియన్ల క్లబ్‌లో అజ్ఞాతవాసి

2 మిలియన్ల క్లబ్‌లో అజ్ఞాతవాసి

సంక్రాంతి రేసులో విడుదలైన తెలుగు సినిమాల కలెక్షన్లు ఆదివారం వరకు ఇలా ఉన్నాయి. అజ్ఞాతవాసి చిత్రం $1,984,745 డాలర్లు అంటే రూ. 12.6 కోట్లు కలెక్ట్ చేసింది. జై సింహా చిత్రం 191,590 డాలర్లు అంటే రూ.1.21 కోట్లు, రంగులరాట్నం 41,140 డాలర్లు అంటే రూ.26.1 కోట్లు వసూలు చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X