చురకత్తులు దూసి.. పవన్ గుండెకు గాయం.. అజ్ఞాతవాసి మరో పాట రిలీజ్..

By Rajababu

Recommended Video

గాలి వాలుగా.. అజ్ఞాతవాసి మరో పాట రిలీజ్..!

అజ్ఞాతవాసి సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. చిత్రానికి అనిరుధ్ అందిస్తున్న సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ డిసెంబర్ 12న (మంగళవారం) రిలీజ్ చేశారు.

గాలివాలుగా ఓ గులాబి పాట

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాడిన గాలి వాలుగా ఓ గులాబి.. గాయమైంది గుండెకు తగిలి అంటూ వచ్చే పాటను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసింది. చురకత్తులు దూసి తపన పెంతుంటావే అంటూ రాసిన సాహిత్యం ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.

 పవన్ ఫైట్స్ స్వీక్వెన్స్

పవన్ ఫైట్స్ స్వీక్వెన్స్

ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అజ్ఞాతవాసి చిత్రంలో అభిమానులకు పిచ్చెక్కించే విధంగా ఫైట్స్ సీక్వెన్స్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది. ఏకంగా ఈ చిత్రంలో ఏడు ఫైట్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం.

 భారీగా యాక్షన్ సీన్లు

భారీగా యాక్షన్ సీన్లు

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు చిత్రంలో ఫైట్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తాయి. అతడు సినిమాకు మించిన ఫైట్స్‌ను ఈ చిత్రంలో కంపోజ్ చేసినట్టు తెలుస్తున్నది. మూడు యాక్షన్ సీన్లకైతే భారీగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ ఫైట్స్‌ను రోమాలు నిక్కబొడిచే విధంగా రూపొందించినట్టు సినీవర్గాల్లో ప్రచారం అవుతున్నది.

 ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన

ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన

ఇప్పుడు ఆ చిత్రాల రికార్డులను ‘అజ్ఞాతవాసి' తిరగరాయనున్నది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పవన్‌ ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

 జనవరి 10న ఫ్యాన్స్‌కు పండుగే

జనవరి 10న ఫ్యాన్స్‌కు పండుగే

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X