అజ్ఞాతవాసి బొమ్మ పడింది.. రికార్డుల వేట మొదలైంది.. (లైవ్ అప్‌డేట్స్)

సినీ అభిమానులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న అజ్ఞాతవాసి చిత్రం అమెరికాలో రిలీజైంది. ఈ చిత్రానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీ కోసం...

By Rajababu

సినీ అభిమానులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న అజ్ఞాతవాసి చిత్రం అమెరికాలో రిలీజైంది. తొలి ఆట పడకముందే అమెరికాలో అడ్వాన్సు బుకింగ్ ద్వారా 1 మిలియన్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీ కోసం...

Recommended Video

ఫ్యాన్స్‌కు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్..!
విక్టరీ వెంకటేష్‌కు థ్యాంక్స్‌తో

విక్టరీ వెంకటేష్‌కు థ్యాంక్స్‌తో

1. విక్టరీ వెంకటేష్‌కు సిన్సియర్ థ్యాంక్స్‌తో టైటిల్స్ ఫ్రారంభమయ్యాయి. ఈ చిత్రం నిడివి 2 గంటల 38 నిమిషాలు.

2. యాక్సిడెంట్‌తో సీన్‌తో సినిమా టెన్షన్‌తో కూడిన వాతావరణంతో మొదలైంది. ఈ సీన్‌ ద్వారా బోమన్ ఇరానీ ఎంట్రీ జరిగింది.

పవన్ కల్యాణ్ ఫైట్ దిమ్మతిరిగేలా

పవన్ కల్యాణ్ ఫైట్ దిమ్మతిరిగేలా

3. సీనియర్ నటి ఖుష్భూ, బోమన్ ఇరానీ మధ్య కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.

4. ప్రేక్షకుల కేరింతలు, హంగామా మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెర మీదకు వచ్చేశాడు. మొదటి ఫైట్ దిమ్మతిరిగేలా ఉంది. మార్షల్ ఆర్ట్ ఫైట్స్‌తో అదరగొట్టాడు. ఆ తర్వాత ధగధగమనే పాట మొదలైంది. వారణాసిలో దిమ్మ తిరిగే సీన్లు ఉన్నాయి. పవన్ సూపర్‌గా ఉన్నాడు.

పవన్ కుర్చీ తిప్పే సీన్

పవన్ కుర్చీ తిప్పే సీన్

ఆ తర్వాత పవన్ కుర్చీ తిప్పే సీన్ వస్తుంది. పవన్ డైలాగ్స్‌తో థియేటర్ దద్దరిల్లింది. కొద్ది సేపటికి కమెడియన్ వెన్నెల కిషోర్ వచ్చీ రాగానే పంచులు వదిలాడు.

6. అను ఇమ్మాన్యూయేల్ ఇంట్రీ అదిరింది. మురళీ శర్మ అసిస్టెంట్‌గా అను చాలా అందంగా ఉంది.

మధురపురి పాటతో కీర్తీ సురేష్

మధురపురి పాటతో కీర్తీ సురేష్

7. కుష్బూ, పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన డైలాగ్స్. సీన్ బాగా పండింది.

8. మధురపురి పాటతో హీరోయిన్ కీర్తీ సురేష్ తెర మీద మెరిసింది. కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది.

పవన్ కల్యాణ్, కీర్తీ సురేష్ మధ్య

పవన్ కల్యాణ్, కీర్తీ సురేష్ మధ్య

9. పవన్ కల్యాణ్, కీర్తీ సురేష్ మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశం ఆకట్టుకొనేలా ఉంది. పవన్ స్టయిల్ బాగున్నది.

10. సినిమా ప్రారంభమైన సుమారు గంట తర్వాత అను, పవన్ కల్యాణ్ మధ్య ‘బయటకు వచ్చి చూస్తే టైమ్' అనే పాట మొదలవుతుంది. పాటను అద్భుతంగా చిత్రీకరించారు.

విలన్‌గా ఆది పినిశెట్టి

విలన్‌గా ఆది పినిశెట్టి

11.
అజ్ఞాతవాసి చిత్రంలో ప్రధాన విలన్ ఆది పినిశెట్టి రోల్ ప్రవేశించింది. ఆది పాత్ర చాలా కొత్తగా ఉంది. సాఫ్ట్ విలన్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.

12. మరికొద్ది సేపటికి కీర్తీ సురేష్, పవన్ కల్యాణ్ మధ్య గాలివాలుగా పాట మొదలైంది. అందమైన లోకేషన్లలో పాటను అద్భుతంగా చిత్రీకరించారు.

 పాండవ వనవాసం నేపథ్యంగా

పాండవ వనవాసం నేపథ్యంగా

13. పాండవ వనవాసం కథా నేపథ్యంగా ఓ సీన్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఖష్భూను కాపాడే ఫైట్ సూపర్. కథ చాలా రసవత్తరంగా ముందుకెళ్లింది. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా ఉంది.

14.
తెర మీద అద్భుతంగా పవన్ కల్యాణ్‌ను చూపిస్తూ.. ఓ అద్భుతమైన ట్వీస్ట్‌తో ఇంటర్వెల్ కార్డు పడింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. రెండో భాగంపై ఆసక్తిని పెంపొందించే విధంగా ఉంది.

ఇంటర్వెల్ తర్వాత యమ స్పీడ్

ఇంటర్వెల్ తర్వాత యమ స్పీడ్

ఇంటర్వెల్ తర్వాత అజ్ఞాతవాసి కథ స్పీడ్ పెరుగుతుంది. పవన్, ఆది మధ్య హోరాహోరీగా ఓ సీన్ ఉంటుంది. చాలా ఎమోషన్‌తో కూడిన సన్నివేశం. ఆ తర్వాత సంపత్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది.

ఆసక్తికరమైన సన్నివేశాల నడుమ ఫ్యాష్ బ్యాక్ మొదలైంది. బోమన్ ఇరానీ అతని కథ చెప్పడం ద్వారా కథ ఫ్లాష్‌బ్యాక‌్‌లోకి వెళ్తుంది.

పవన్ అసలు పేరు అభిషిక్త్ భార్గవ్

పవన్ అసలు పేరు అభిషిక్త్ భార్గవ్

ఫ్లాష్ బ్యాక్‌లో పవన్ కథ మొదలైంది. పవన్ అసలు పేరు అభిషిక్త్ భార్గవ్. పవన్ గురించి ఏమిటో ఆసక్తికరంగా స్టోరి నడుస్తున్నది. కథ ఫ్యాష్ బ్యాక్ నుంచి రియల్ కథలోకి వచ్చాక హెలికాఫ్టర్ యాక్షన్ సీన్ ఆకట్టుకునేలా చిత్రీకరించారు.

ఆ కొద్ది సేపటికే.. ట్రైలర్‌, పోస్టర్‌లో వైరల్‌గా మారిన సైకిల్‌పై కూర్చొని బెల్ట్ నోట్లో పెట్టుకొన్న సీన్ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపేలా షూట్ చేశారు.

ఆసక్తికరమైన కథనంతో సినిమా ప్రీ కైమాక్స్ వైపు దూసుకెళ్తున్నది.

ప్రీ క్లైమాక్స్‌లో కొడుకా కోటేశ్వరరావు

ప్రీ క్లైమాక్స్‌లో కొడుకా కోటేశ్వరరావు

ప్రీ క్లైమాక్స్‌లో కొడుకా
మురళీశర్మ, రావు రమేష్ మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులు మంచి హాస్యాన్ని పంచుతాయి. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్‌లో కొడుకా కోటేశ్వరరావు పాట మొదలు కాగానే ఆడియెన్స్ కిరాక్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఆఫీస్ సీన్లు కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయి.

పవన్ కల్యాణ్ మధ్య నువ్వానేనా అనే విధంగా మరో సీన్ ఉంటుంది. ఈ క్రమంలో తన తండ్రి రాసిన విల్లు గురించి అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఏబీ బేబీ పాట వస్తుంది. ఛేజింగ్ సీన్లు ఆసక్తికరంగా చిత్రీకరించారు.

కథ క్లైమాక్స్ చేరుకొనే క్రమంలో పవన్ కల్యాణ్, ఆది మధ్య యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయి. చివరికి చక్కటి ముగింపుతో సినిమా పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X