twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతవాసి టీజర్ సూపర్.. సోషల్ మీడియాలో దుమారం..

    By Rajababu
    |

    అజ్ఞాతవాసి సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యే ఈ చిత్ర టీజర్‌ను శనివారం (డిసెంబర్ 16)న రిలీజ్ చేశారు. టీజర్ రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై వైరల్‌గా మారింది. ఈ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ టీజర్‌పై మీరు ఒక లుక్కేయండి..

     గాలివాలుగా ఓ గులాబి పాట

    గాలివాలుగా ఓ గులాబి పాట

    సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాడిన గాలి వాలుగా ఓ గులాబి.. గాయమైంది గుండెకు తగిలి అంటూ వచ్చే పాటను ఇటీవల ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసింది. చురకత్తులు దూసి తపన పెంతుంటావే అంటూ రాసిన సాహిత్యం ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.

     పవన్ ఫైట్స్ స్వీక్వెన్స్

    పవన్ ఫైట్స్ స్వీక్వెన్స్

    ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అజ్ఞాతవాసి చిత్రంలో అభిమానులకు పిచ్చెక్కించే విధంగా ఫైట్స్ సీక్వెన్స్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది. ఏకంగా ఈ చిత్రంలో ఏడు ఫైట్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసినట్టు సమాచారం.

     భారీగా యాక్షన్ సీన్లు

    భారీగా యాక్షన్ సీన్లు

    త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు చిత్రంలో ఫైట్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తాయి. అతడు సినిమాకు మించిన ఫైట్స్‌ను ఈ చిత్రంలో కంపోజ్ చేసినట్టు తెలుస్తున్నది. మూడు యాక్షన్ సీన్లకైతే భారీగా ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ ఫైట్స్‌ను రోమాలు నిక్కబొడిచే విధంగా రూపొందించినట్టు సినీవర్గాల్లో ప్రచారం అవుతున్నది.

     ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన

    ఫస్ట్‌లుక్‌కు అనూహ్య స్పందన

    ఇప్పుడు ఆ చిత్రాల రికార్డులను ‘అజ్ఞాతవాసి' తిరగరాయనున్నది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పవన్‌ ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

     జనవరి 10న ఫ్యాన్స్‌కు పండుగే

    జనవరి 10న ఫ్యాన్స్‌కు పండుగే

    పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Pawan kalyan latest movie is Agnathavasi. Pawan Kalyan's Agnyaathavaasi second song released.This film is getting ready for Sankrathi festival. After this movie. This movie going to release in highest locations in US. Pawan movie is going to break all the records like Baahubali and Dangal Records theatre wise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X