అజ్ఞాతవాసి టీజర్ రికార్డుల మోత.. టాలీవుడ్ చరిత్రను తిరుగరాసిన పవన్

By Rajababu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తున్నది. శనివారం (డిసెంబర్ 17న) రిలీజైన అజ్ఞాతవాసి టీజర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి దుమ్ము రేపుతున్నది. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఓ రికార్డును సొంతం చేసుకొన్నదని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారికా, హాసిని బ్యానర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రికార్డు ఏమిటంటే..

టాలీవుడ్‌లో రికార్డు

టాలీవుడ్‌లో రికార్డు

అజ్ఞాతవాసి టీజర్ ఒక నిమిషం నిడివితో విడుదలైంది. రిలీజైన కొద్దిగంటల్లోనే 347,000 లైకులను సొంతం చేసుకొన్నది. ఇది టీజర్ టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇదే ఓ రికార్డు. ప్రస్తుతం 363,536 లైక్‌లతో దూసుకెళ్తున్నది.

 4 మిలియన్ల వ్యూస్

4 మిలియన్ల వ్యూస్

అజ్ఞాతవాసి టీజర్ గత 12 గంటల్లో 4,491,913 సొంతం చేసుకొన్నది. ఈ రేంజ్‌లో టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తే సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది.

 పవన్ కల్యాణ్ మార్క్

పవన్ కల్యాణ్ మార్క్

అజ్ఞాతవాసి టీజర్‌ మొత్తంగా పవన్ కల్యాణ్ మార్క్ కనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ కనిపించింది. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది.

 ఓవర్సీస్‌లో రికార్డు

ఓవర్సీస్‌లో రికార్డు

అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్‌కు సంబంధించి ఓవర్సీస్‌‌లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. అమెరికా మార్కెట్‌లో ఇప్పటివరకు బాహుబలిదే ఓ రికార్డు. ఇప్పుడు బాహుబలి చిత్ర రిలీజ్‌ రికార్డును తిరగరాస్తూ యూఎస్‌లో 209 థియేటర్లలో, 126 ప్రదేశాల్లో రిలీజ్ అవుతున్నది.

5 కోట్లతో సెట్

5 కోట్లతో సెట్

అజ్ఞాతవాసి చిత్రం పవన్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రం కోసం 5 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా కనిపించనున్నారు.

జనవరి 10న రిలీజ్

జనవరి 10న రిలీజ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అజ్ఞాతవాసి చిత్రంలో పవన కల్యాణ్ సరసన కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్, బోమన్ ఇరానీ, కుష్భూ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X