twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతవాసి రన్‌టైం వింటే షాకే.. అర్జున్‌రెడ్డికి ధీటుగా స్ట్రాటెజీ

    By Rajababu
    |

    ఒకప్పుడు సినిమా నిడివి 2 గంటలు దాటితే నిర్మాత, దర్శకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎక్కువ లెంగ్త్ ఉన్న చిత్రాలు చూసిన అలవాటు లేదు. అర్జున్‌రెడ్డి తర్వాత కంటెంట్ బలంగా ఉంటే లెంగ్త్ ఎంతైనా ఫర్వాలేదు అనే మాట వినిపిస్తున్నది. అయితే ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

     నిడివి ఎక్కువైతే..

    నిడివి ఎక్కువైతే..

    సాధారణంగా తెలుగు సినిమాల నిడివి సగటున 2.20 గంటల నిడివి ఉండేలా చూసుకొంటారు. ఆ లెంగ్త్‌కు కాస్తా ఎక్కువైతే కొన్ని సీన్లను తీసేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఎందుకంటే సినిమా లెంగ్త్ ఎక్కువైతే ప్రేక్షకుడు ఎలా స్పందిస్తాడో అనే భయం నిర్మాతలకు కలగడం సహజం.

    అజ్ఞాతవాసి నిడివి ఇదే

    అజ్ఞాతవాసి నిడివి ఇదే

    అయితే అజ్ఞాతవాసి చిత్రం విషయంలో ఆ వ్యూహానికి పరిమితం కావడం లేదట. అజ్ఞాతవాసి ఫైనల్ కాపీ ప్రస్తుత లెంగ్త్ 2.45 నిమిషాలు అనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఫైనల్ కాపీని ఉంచాలా? లేదా కుదించాలా అనే విషయంపై చర్చలు జరుపుతున్నట్టు తాజా సమాచారం.

    భావోద్వేగ సన్నివేశాలు

    భావోద్వేగ సన్నివేశాలు

    చివరి నిమిషంలో తనకు ఇష్టమైన సీన్లను చేర్చడం వల్ల నిడివి ఎక్కువైనట్టు సమాచారం. సెకాండాఫ్‌లో కీలక కథ ఉండటం, ఆ కథకు అనుగుణంగా భావోద్వేగ సన్నివేశాలు పండేలా తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారట.

     నిడివి నో ప్రాబ్లెం

    నిడివి నో ప్రాబ్లెం

    ఆ క్రమంలోనే రన్‌టైంను 2.45 గంటలపాటు పెట్టేద్దామనేది చిత్ర యూనిట్‌లో ఓ వర్గం వాదన. అయితే నిడివిపై కత్తెర్లు వేసే విషయంపై ఆచితూచీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.

     అజ్ఞాతవాసి పుల్ మీల్స్

    అజ్ఞాతవాసి పుల్ మీల్స్

    ఒకవేళ అజ్ఞాతవాసి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే పవన్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ నిడివితో సినిమాలో రచ్చరచ్చ చేయడానికి వీలుంటుంది. మరి అంత నిడివిని పెడుతారా లేదా తగ్గిస్తారా వేచి చూద్దాం.

    పవన్ మళ్లీ గొంతు సవరణ

    పవన్ మళ్లీ గొంతు సవరణ

    అత్తారింటికి దారేది చిత్రంలో మాదిరిగానే పవన్ కల్యాణ్ చేత త్రివిక్రమ్ ఓ పాటను గురువారం (డిసెంబర్ 21)న పాడించారు. పవన్ పాట పడుతున్న సందర్భంలో షూట్ చేసిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఈ ఫొటోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

    English summary
    Pawan kalyan latest movie is Agnyaathavaasi. This movie's length is now talk of the Industry. Reports suggest that Agnyaathavaasi movie's length is 2 hours 45 mins. Film Unit will go for release with the heavy length.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X