‘అత్తారింటికి దారేది’ ట్రైలర్ రివ్యూ...
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్తారింటికి దారేది చిత్రం థియేటర్ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ను పరిశీలిస్తే ఈచిత్రం హై కమర్షియల్ వ్యాల్యూస్‌తో కూడిన సినిమా అని స్పష్టమవుతోంది. సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ అండ్ డ్రామా లాంటి వివిధ షేడ్స్ ప్రేక్షకులను ఆకర్షించనున్నాయి.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకు ముందు అతడు, జులాయి చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభేంటో రూచి చూపించారు. ఆయన సినిమాలు ఎంటర్టెన్మెంట్ పెట్టింది పేరు అనే ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 'అత్తారింటికి దారేది' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దర్శకుడు త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ విషయంలో కానీ, సీన్లు విషయంలో కానీ కాంప్రమైజ్ అయ్యే రకంకాదు. తను అనుకున్నట్లు సీన్ వచ్చే వరకు తనవంతు ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఆయన పవన్ కళ్యాన్ కోసం ప్రత్యేకించి రాసే పంచ్ డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షనను తెస్తాయి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్. పవన్ కళ్యాణ్‌తో నటించడం తన అదృష్టమని ఇటీవల సమంత ఆడియో వేడుకలో వ్యాఖ్యానించింది.
బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో ఇంకా ప్రణీత, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బోమన్ ఇరానీ, అలీ, నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది.

అత్తారింటికి దారేది స్టోరీ
పవన్ ఒక మిలీయనీర్. తాతయ్య బొమన్ ఇరానీతో కలసి విదేశాల్లో ఉంటాడు. ఇండియాలో తనకో కుటుంబం ఉందని, ఓ అత్తయ్య (నదియా) ఉందని తెలుస్తుంది. అయితే... తమ రెండు కుటుంబాలకూ ఓ తగాదా ఉందని కూడా అర్థమవుతుంది. దాన్ని తీర్చడానికి ఇండియా వస్తాడు. ఇక్కడ సమంతని చూసి ఇష్టపడతాడు. ఇంతకీ సమంత ఎవరో కాదు.. స్వయానా మరదలు. అత్తయ్య మనసు మార్చడానికి ఆ ఇంట్లోనే పవన్ డ్రైవర్‌గా చేరతాడు. ఆ తరవాత ఏమైంది?? అనేదే ఈ సినిమా కథ.

పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటంటే..
ఇటీవల విదులైన అత్తారింటికి దారేది 1.30 నిమిషాల ట్రైలర్లో పవర్ రోల్ ఎలా ఉండబోతోందనే విషయం స్పష్టం చేస్తుంది. అత్త పెత్తనాన్ని అణచి వేసే పాత్ర. ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండనుంది. అత్తయ్య మనసు మార్చడానికి ఆ ఇంట్లోనే పవన్ డ్రైవర్‌గా చేరతాడు.

సమంత పాత్ర ఏమిటంటే..
ఈ చిత్రంలో సమంత పాత్ర పేరు శశి. పవన్ కళ్యాన్ అత్త కూతరు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది. ట్రైలర్లు వీరి మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు సైతం చూపించారు. వీరి మధ్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి.

బ్రహ్మీ-శ్రీనివాస్ రెడ్డి
అత్తారింటికి దారేది చిత్రం మంచి కామెడీ ఎంటర్టెనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి, అలీ లాంటి స్టార్ కమెడీయన్స్ ఉన్నారు. ట్రైలర్లో వీరున్న సీన్లను చూపించడాన్ని బట్టి సినిమాలో మంచి కామడీ ఉందనే హింట్ ఇచ్చారు.

హంసా నందిని స్పెషల్ సాంగ్
హాట్ లేడీ హంసా నందిని ఈచిత్రంలో ఓ స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. ట్రైలర్లో ఇందుకు సంబంధించిన సీన్లను కూడా చూపించారు. ఖుషీ సినిమాలో నటించిన ముంతాజ్ కూడా ఈ సాంగులో కనపడనుంది. ఈ సాంగు ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం అలరించే విధంగా ఉండటం విశేషం.

పవన్ కళ్యాణ్ యాక్షన్ డ్రామా
అత్తారింటికి దారేది చిత్రంలో పలు యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇటలీ తదితర ప్రాంతాల్లో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఈ ఫైటింగ్ సీన్లు చిత్రీకరించారు. ట్రైలర్ చూస్తుంటే ఈ యాక్షన్ సీన్లు డిఫరెంటుగా, యూనిక్‌గా ఉండనున్నాయని తెలుస్తోంది.

హీరోయిన్ ప్రణీత పాత్ర...
అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత సెకండ్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుందనే హింట్ మాత్రం ట్రైలర్లో చూపించలేదు. మొత్తానికి ఆమె సినిమాలో కీలకమైనదిగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే.

అత్తారింటికి దారేది చిత్రంలో నదియా
నదియా, రావు రమేష్ ‘అత్తారింటికి దారేది' చిత్రం ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో పోషిస్తుండగా, రావు రమేష్ నదియా భర్త పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పాత్రలు సినిమాలో ఎంతో కీలకం.

బోమన్ ఇరానీ పాత్ర
బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తొలిసారిగా అత్తారింటికి దారేది చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ పవన్ కళ్యాణ్ తాత పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో బోమన్ ఇరానీ పాత్ర ఎంతో కీలకకంగా ఉండనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











