twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదిరాయ్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో మరోసారి రుజువైంది. ఆయన నటించిన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రం శుక్రవారం విడుదలై రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈచిత్రం తొలి రోజు ఊహించని రీతిలో కలెక్షన్లు సాధించింది.

    ఏపీ ఫస్ట్ డే షేర్ విషయంలో 'అత్తారింటికి దారేది' సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలి రోజు రూ 10.6 కోట్ల షేర్ సాధించింది. గతంలో ఈ రికార్డు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ పేరు మీద ఉండేది. సంక్రాంతికి విడుదలైన నాయక్ తొలి రోజు రూ. 9.95 కోట్లు ఫస్ట్ డే ఏపీ షేర్ సాధించింది.

    ఇక వరల్డ్ వైడ్‌గా అత్తారింటికి దారేది కలెక్షన్లు రూ. 16 కోట్ల వరకు ఉంటాయని అంచనా. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవర్ స్టార్ సినిమా విడుదలైన ప్రతిసారి ఇలాంటి రికార్డులు మామూలే. అయితే పైరసీ, విడుదల ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఈచిత్రం ఈ రేంజిలో బాక్సాఫీసు కలెక్షన్ల విషయంలో రచ్చ సృష్టించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    After Megastar Chiranjeevi, his brother Power Star Pawan Kalyan is next most beloved and revered in Telugu film industry. Now, the Pawan mania is at its peak in all theatres screening his much-awaited movie Attarintiki Daredi (AD), which has hit the marquee yesterday. The Trivikram Srinivas-directed film has received an overwhelming opening at the Box Office not only in Andhra Pradesh, but also in other parts of the globe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X