పవన్ కళ్యాణ్ బైక్ కూడా వేలం వేస్తారట!
హైదరాబాద్: ఈ మధ్య తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఖరీదైన బైకులను వాడుతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అభిమానుల కోసం వాటిని వేలం వేయండం....ఆ బైకు కోసం పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టు కోవడం, అలా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తుండటం చేస్తున్నారు నిర్మాతలు. పైగా ఈ వేలం ప్రక్రియ సినిమాకు పబ్లిసిటీగా కూడా ఉపయోగ పడుతుంది.
ఇటీవల బాలయ్య నటించిన ‘లెజెండ్' సినిమాలో ఆయన కోసం ప్రత్యేకంగా హార్లే డేవిడ్సన్ బైకు డిజైన్ చేయించి వేలం వేసిన సంగతి తెలిసిందే. తర్వాత రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో వాడిని హార్లే డేవిడ్సన్ బైకు కూడా వేలం వేయాలని నిర్ణయించారు.

తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా' చిత్రంలోని బైక కూడా వేలం వేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 'గోపాల గోపాల' చిత్రంలో పవన్ వాడిన బైక్ పూర్తిగా బ్లూ కలర్ లో వుంటుంది. దీన్ని రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ కొన్ని మెరుగులు దిద్దారు.
అనంతరం మాదాపూర్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రించారు. దాదాపు 6.6 లక్షలు ఖరీదు చేసే ఆక్విలా ప్రో బ్లూకలర్ బైక్ అది. ఈ చిత్రం షూటింగ్ అయ్యాక దాన్ని వేలం వేయనున్నారు. ప్రస్తుతం నానక్‌రామ్‌గూడా విలేజ్‌లో షూటింగ్ జరుగుతోంది. తడాఖా చిత్ర దర్శకుడు డాలీ దర్శకుడు. డి.సురేష్‌బాబు నిర్మాత.


Click it and Unblock the Notifications











