లగ్జరీ జీవితాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ త్యాగం... బన్నీ, ఇతర స్టార్ల ట్వీట్స్!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరిలో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అని సంబోధిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెటర్ సొసైటీ కోసం మీరు పడే తపన చూసి మీకు భక్తుడినైపోయాను. లగ్జరీ జీవితాన్ని, కంఫర్టబుల్ లైఫ్ వదిలేశారు. మీరు చేసిన త్యాగం వల్లనే ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాంటూ ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ ట్వీట్
పవన్ కళ్యాణ్ జనసేన ఫోటో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. బన్నీ చేసిన ఈ ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే ట్విట్టర్లో వైరల్ అయింది. మెగా అభిమానులు దీన్ని రీట్వీట్స్, లైక్స్ చేస్తూ టాప్‌లో ట్రెండ్ అయ్యేలా చేశారు.
రామ్ చరణ్ విన్యాసం
రామ్ చరణ్‌కు ట్విట్టర్ అకౌంట్ లేక పోవడంతో ఆయన సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ చెప్పిన మాటలను ఉటంకించారు. ఈ సందర్భంగా బాబాయ్ కోసం చరణ్ చేసిన సాహస విన్యాసం వీడియో షేర్ చేశారు.
ఖుష్భూ ట్వీట్
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఖుష్భూ విష్ చేస్తూ... పవన్ కళ్యాణ్ మాటలు తక్కువ మాట్లాడతారు కానీ చేతలు గొప్పగా ఉంటాయి అంటూ వ్యాఖ్యానించారు.
అల్లు శిరీష్ ట్వీట్
పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా హీరో అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ... కళ్యాణ్ బాబాయ్ ప్రభావం తనపై ఎంతో ఉందని, మీ అభిమానుల్లో నేనూ ఒకరిని. ప్రజల కోసం మీరు చేస్తున్న మంచి పనులను గౌరవిస్తున్నాను. దేవుడు ఎప్పుడూ మీ వైపు ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు.
వరుణ్ తేజ్ ట్వీట్
బాబాయ్‌ని విష్ చేస్తూ వరుణ్ తేజ్ ట్వీట్. సమాజం కోసం మీరు చేస్తున్న సేవను చూసి తాను స్పూర్తి పొందుతున్నాను అని వరుణ్ తేజ్ తెలిపారు.
సాయి ధరమ్ తేజ్
మామయ్య పుట్టినరోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ.... మన కోసం ఆయన అన్నీ ఇచ్చేశారు, ఎన్నో త్యాగం చేశారు. అందుకే ఆయన అంత పెద్ద లీడర్ అయ్యారు అంటూ పుట్టినరోజు విషెస్ తెలియజేశారు.
గువెరాతో పోలుస్తూ
పవర్ స్టార్‌ను చే గువెరాతో పోలుస్తూ యంగ్ హీరో నిఖిల్ ట్వీట్.
నితిన్ విషెస్
పవన్ కళ్యాణ్‌ను అమితంగా అభిమానంచే యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. నిన్న రాత్రి సరిగ్గా 12 దాటగానే నితిన్ తన ట్విట్టర్లో పవర్ స్టార్‌ను విష్ చేస్తూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











