»   » అకీరా హైటు చూస్తే షాకే: భార్యా, పిల్లలతో పవన్ కళ్యాణ్ వెకేషన్ (ఫోటోస్)

అకీరా హైటు చూస్తే షాకే: భార్యా, పిల్లలతో పవన్ కళ్యాణ్ వెకేషన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఆయన సినిమా జర్నీ మాత్రమే కాదు, పొలిటికల్ జర్నీ, పర్సనల్ జర్నీ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్.

సాధారణంగా పవన్ కళ్యాణ్ విదేశాల్లో జరిగే తన సినిమా షూటింగులకు భార్య పిల్లలను తీసుకుని రావడం చాలా అరుదు. అయితే ఈ సారి ఆయన తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని బల్గేరియా వెళ్లడం హాట్ టాపిక్ అయింది.

షూటింగులో భాగంగా

షూటింగులో భాగంగా

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి పాటల షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. షూటింగుతో పాటు ఫ్యామిలీ వెకేషన్ కూడా ప్లాన్ చేశాడు పవర్ స్టార్.

ముగ్గురు పిల్లలతో

ముగ్గురు పిల్లలతో

పవన్ కళ్యాణ్ వెంట ఆయన భార్య అన్నా లెజెనివా, కూతురు పోలెనాతో పాటు అకీరా నందన్, ఆద్యా కూడా ఉండటం గమనార్హం. ఈ ఫోటోలు ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

అకీరా షాకింగ్ హైట్

అకీరా షాకింగ్ హైట్

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అయితే అకీరా హైటు చూసిన చాలా మంది షాకవుతున్నారు. ఈ వయసులోనే అకీరా పవన్ కళ్యాణ్ ను మించి పోయాడు. ఇక్కడ ఫోటో గమనిస్తే అకీరా హైటు ఎంత ఉందో అర్థమవుతుంది.

ఎంత ఎదిగాడో? పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా న్యూ లుక్

ఎంత ఎదిగాడో? పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా న్యూ లుక్

వన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ కుమారుడు అకీరా నందన్ లేటెస్ట్ ఫోటో చూసిన మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పాలుగారే పసివాడిలా ఉన్న అకీరా ఇపుడు అమ్మ రేణు దేశాయ్‌ని మించి పోయాడు.

మరిన్ని వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Accompanied by his wife Anna Lezhenova, son Akira, daughters Adya and Polena, Pawan Kalyan went to Bulgaria.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu