twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ '....రాంబాబు' లో ఆ సీన్స్ సినిమాకు ప్రాణం

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కెమెరామన్ గంగతో రాంబాబు' . యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంతో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం హైలెట్స్ పై చర్చ అంతటా జరుగుతోంది. హైలెట్స్ లో ముఖ్యంగా క్లైమాక్స్ నిలుస్తుందని చెప్తున్నారు. ఠాగూర్ తరహాలో ఈ చిత్రం క్లైమాక్స్ భారీగా జనం మధ్య తీసారు. దానికి తగినట్లే నేచురల్ గా ఈ క్లైమాక్స్ కు డబ్బింగ్ చెప్పిస్తున్నారు.

    ఈ చిత్రం క్లైమాక్స్ లో భారీగా తరలివచ్చిన జనం మధ్యన పవన్‌ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ చెప్తారు. ఆ డైలాగ్స్ కి చుట్టూ ఉన్న జనం సపోర్టు చేస్తూ పెద్ద పెట్టున అరుస్తూంటారు. ఆ శబ్దాలను తెరపై న్యాచురాలిటీగా చూపించేందుకు డబ్బింగ్ కి నిర్మాతలు ఓ గమ్మత్తైన విధానాన్ని అనుసరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఓ ప్లోర్ ని అద్దెకు తీసుకుని కొన్ని వేల మందిని తీసుకువచ్చి,వారి చేత కావాల్సిన శబ్దాలు చేయించి,రికార్డ్ చేసి సినిమాలో ఉపయోగించనున్నారు. ఈ ఎఫెక్టు సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని,ధియోటర్ నుంచి బయిటకు వచ్చే ప్రతీ ప్రేక్షకుడు దీన్ని గురించి చర్చించుకుంటారని అంచనా వేస్తున్నారు.

    ఇక ఈ చిత్రం రీరికార్డింగ్ పూర్తయిందని, మిగిలిన కార్యక్రమాలు ముగించి, అత్యధిక ప్రింట్లతో ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాత దానయ్య చెప్పారు. 'ఈ సినిమా ఆడియో, ట్రైలర్స్ విడుదలయ్యాక అంచనాలు భారీగా పెరిగాయి. వాటికి ఏ మాత్రం తగ్గని రీతిలో సినిమా ఉంటుంది. మా హీరో పవన్‌కళ్యాణ్‌గారు నటించిన 'గబ్బర్‌సింగ్' చిత్రాన్ని మించి ఇది హిట్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను. పవర్‌స్టార్ అభిమానులకు ఈ సినిమా నేత్రపర్వంగా ఉంటుంది.

    అలాగే హీరోయిన్ తమన్నా అభినయం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా బేనరులో జగన్‌గారు చేస్తున్న నాలుగో సినిమా ఇది. కమర్షియల్ అంశాలతో అందరినీ ఆకట్టుకొనే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దారాయన. మా బేనరులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని ఆయన తెలిపారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గేబ్రియల్, ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మనందం ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Puri Jagannath upcoming entertainer Cameraman Gangatho Rambabu will also have a unique factor to give a fresh feel for the audience. It's already known that thousands of people have participated in the climax shoot of CGR, walking along with the protagonist played by Pawan Kalyan and chanting slogans. Now, the dubbing of this sequence will be done using equally the same numbers of crowd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X