పంజా సినిమాలో పవన్ క్యారెక్టర్ మరో సరికొత్త, స్టైలిష్ పేరు...!?
పవన్ కళ్యాణ్ 'పంజా" చిత్రంపై రోజుకో వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది. పంజా చిత్రం నిన్నటితో సక్సస్ ఫుల్ గా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొన్నది. ఇప్పటికే ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే పవన్ పంజా పాటలు మార్కెట్లో పంజా విసురుతున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే... పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ పేరు 'జై" అని ప్రచారం సాగుతోంది.
పాపారాయుడు పాటలో బ్రహ్మానందం అతన్ని జై అని పిలుస్తాడు. అంతేగాక నిర్మాత సైతం ఈ పేరుని ఖరారు చేశారని తెలుస్తుంది. అయితే మాఫియా డాన్ గా ఉండేటప్పుడు మాత్రం పవన్ పేరు జాక్సన్ రాబర్ట్ అని సమాచారం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ నటించే చిత్రాల్లో తన క్యారెక్టర్ నేమ్స్ వెరైటీగా, స్టైలిష్ గా పెట్టుకొని ఫ్యాన్స్ ఆకర్షితుల్ని చేసేశాడు. బెంగాల్ టైగర్ సిద్దు సిద్దార్థ రాయ్, బద్రి..బద్రీనాథ్, మైకెల్ వేలాయుధం, అర్జున్ పాల్వాయ్, ఇప్పుడు మరో వైరైటీ నేమ్ జై.
అంతే కాదు మరో సరికొత్త విషయం ఏమిటంటే, ఈ చిత్ర విలన్ గురించి మాకు అందిన సమాచారం మేరకు, అడివి శేష్ విలన్ పాత్రకు ప్రాణం పోసాడు. ఒక క్రూరమైన విలన్ గా అతడి నటన చాలా బాగుందని చెబుతున్నారు. ఒక కథ పండాలంటే హీరో ఎంత ముఖ్యమో, విలన్ కూడా అంతే ముఖ్యం అని మనకి తెలుసు. పంజా విషయంలో ఇది రుజువు కాబోతోందని అంటున్నారు. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. అంజలి లవనియా, సారా జేన్ దియాస్ నటించిన ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ మరియు నీలిమ తిరుమలశెట్టి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











