పవన్ కళ్యాణ్ డాన్స్‌కు థ్రిల్లయిన దర్శకుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డాన్స్ చూసి అంతా థ్రిల్లవుతారని అంటున్నాడు ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఇక్కడ పవన్, శృతి హాసన్‌లపై 'ఆకాశం అమ్మాయైతే' అనే పాటను చిత్రీకరించారు.
ఈ సాంగు చిత్రీకరణ సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ డాన్స్ చూసి చాలా థ్రిల్లయ్యాడట. ఈ విషయాన్ని హరీష్ శంకర్ వెల్లడిస్తూ....పాట అద్భుతంగా చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పవన్ కళ్యాణ్ స్టెప్పులు అదిరాయి. నేనే ఎంతో థ్రిల్లయ్యాను. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు.
హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి భాగ్యలక్ష్మి పాత్ర కనిపించనుంది. భాగ్యలక్ష్మి తండ్రిగా కోట శ్రీనివాసరావు తాగుబోతు పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో ఈనెల 15న గ్రాండ్‌గా, సరికొత్త స్టయిల్‌లో ఒకే రోజు మూడు నగర్లాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











