పవన్ కళ్యాణ్ చేయాల్సిందేమీలేదు!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయడంతో ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని పూర్తిగా అయిపోయింది. మూవీ ఔట్ పుట్ వండర్ ఫుల్‌గా రావడంతో పాటు, సినిమాకు సంబంధించి తను చేయాల్సిన పని పూర్తవడంతో పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఇంటికెళ్లారట.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నైజాంలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 320కి పైగా థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. పవర్ స్టార్ సినిమా కాబట్టి థియేటర్లు ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని, కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తే ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.
ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో జతకలిసి నిర్మించారు. మరో నిర్మాత భోగవల్లి బాపినీడు 'అత్తారింటికి దారేది' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సినిమాకు వసూళ్లు భారీగా వస్తాయని ఆశిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే 'అత్తారింటికి దారేది' చిత్రం బిజినెస్ అదిరి పోయింది. సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులు ముందస్తుగానే రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడమే ఈ పరిణామాలకు కారణం.
స్వతహాగా రచయిత అయిన త్రివిక్రమ్ ఈ చిత్ర స్ర్కిప్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ సీన్లతో పాటు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని యూనిట్ సభ్యలు అంటున్నారు.
పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











