రేణు దేశాయ్ డైరెక్షన్, తెర వెనక ఖుషీ దర్శకుడు!

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్....పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత మరాఠీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రయాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ సినిమాను కూడా నిర్మించారు రేణు దేశాయ్. ఇపుడు దర్శకురాలిగా కూడా అవతారం ఎత్తారు.

'ఇష్క్ వాలా లవ్' అనే చిత్రం ద్వారా రేణు దేశాయ్ దర్శకురాలిగా మారుతోంది. ఈ చిత్రానికి తెర వెనక విభాగంలో 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా పని చేస్తున్నారు. రేణు దేశాయ్ దర్శకత్వంలో వస్తున్న 'ఇష్క్ వాలా లవ్' చిత్రం కోసం రెండు సాంగులను కంపోజ్ చేసాడట ఎస్.జె.సూర్య.

Pawan Kalyan's Ex-Wife Renu Desai Ropes In SJ Surya

ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. నేను దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని రెండు పాటలను ఎస్.జె.సూర్య స్వర పరిచారు. వైశాలి సమంత్ పాడారు. రెండు పాటల రికార్డింగ్ కూడా అయిపోయింది అంటూ రేణు దేశాయ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఖుషి దర్శకుడు తన సినిమా కోసం పని చేయడంపై ఎంతో ఖుషి ఖుషిగా ఉంది రేణు దేశాయ్.

ఇష్క్ వాలా లవ్ విషయానికొస్తే....ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులంగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. మార్చి 15 వ తేదీ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రంపై రేణు దేశాయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. 2014 సంవత్సరాంతం వరకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X