ఆడవాళ్లకు కాదు మగాళ్లకు.. అలా చేయడం కరక్టే.. దిశ ఎన్‌కౌంటర్‌పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

Recommended Video

Renu Desai Sensational Reaction On Disha Case

దిశ ఎన్‌కౌంటర్‌ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నాలుగు మానవ మృగాలను మట్టు పెట్టారు తెలంగాణ పోలీసులు. ఈ ఉదంతంలో హ్యూమన్ రైట్స్ కమీషన్ కూడా ఎంటరైన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రియాక్ట్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకిపోతే..

 ఎన్‌కౌంటర్‌‌పై ప్రజా స్పందన

ఎన్‌కౌంటర్‌‌పై ప్రజా స్పందన

దిశ ఘటన తాలూకు విషయాలు తెలిసి ఉడికిపోయారు జనమంతా. ఆ నిందితులపై ఆగ్రహజ్వాలలు గక్కుతూ వెంటనే వారిని చంపేయాలని డిమాండ్ చేశారు. అందరూ కోరుకున్నట్లుగానే దిశ నిందితులను అంతమొందించారు పోలీసులు. దీంతో ఈ చర్యపై దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎంటరైన రేణు దేశాయ్..

ఎంటరైన రేణు దేశాయ్..

ఈ నేపథ్యంలో ఇదే దిశ ఉదంతం, ఎన్‌కౌంటర్‌‌పై రేణు దేశాయ్ స్పందించింది. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ పోలీసులు అలా చంపేయడం కరక్టే కానీ అంటూ కొన్ని లాజిక్స్ మాట్లాడింది. ఇలా ఇష్టమొచ్చినట్లు చంపుకుంటూ పోతే ఏం చెప్పాలంటూ ప్రశ్నించింది రేణు దేశాయ్.

నడిరోడ్డు మీద కాల్చేస్తారా? అంటూ ప్రశ్న లేవనెత్తిన రేణు

నడిరోడ్డు మీద కాల్చేస్తారా? అంటూ ప్రశ్న లేవనెత్తిన రేణు

ఆ నలుగురు నిందితులు చేసింది క్షమించరాని నేరం.. కాబట్టి వాళ్ళను చంపడం కరెక్టే కానీ అలా చంపడం మాత్రం సరైంది కాదని అంటోంది రేణు. అదే స్థానంలో మంత్రి కొడుకు ఉంటే ఇలాగే నడిరోడ్డు మీద కాల్చేస్తారా? అంటూ ప్రశ్న లేవనెత్తి సంచలనం సృష్టించింది రేణు దేశాయ్. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టే ఆలా జరిగింది.. అదే అక్కడ పెద్దోళ్ల కొడుకులు ఉంటే చంపేంత దమ్ము ఎవ్వరికీ ఉండకపోయేదని రేణు చెప్పుకొచ్చింది.

 తప్పు చేసిన ఏ ఒక్కరికైనా కచ్చితంగా శిక్ష పడాల్సిందే.. కానీ

తప్పు చేసిన ఏ ఒక్కరికైనా కచ్చితంగా శిక్ష పడాల్సిందే.. కానీ

తప్పు చేసిన ఏ ఒక్కరికైనా కచ్చితంగా శిక్ష పడాల్సిందే కానీ.. పడాల్సిన రీతిలో పడాలని అంటోంది రేణు. దేశంలోని అందరికీ ఒకేలా న్యాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెబుతోంది. చట్టానికి వాడు, వీడు అనే తేడా లేకుండా తప్పు చేసిన ఎవడికైనా ఒకేలా శిక్ష పడేలా మార్పు రావాలని కోరుకుంది రేణు. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఆడవాళ్లను కాదు మగాళ్లను

ఆడవాళ్లను కాదు మగాళ్లను

అదేవిధంగా మార్పు కుటుంబం నుంచే రావాలని చెప్పుకొచ్చింది రేణు. పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, స్త్రీల పట్ల గౌరవం లాంటివి నేర్పించాలని చెప్పింది. కేవలం ఆడవాళ్లనే జాగ్రత్తగా ఉండమని చెప్పడం కాదు.. మగాళ్లకు కూడా ఆడవాళ్లను ఎలా గౌరవించడం నేర్పిస్తేనే ఈ సమాజంలో మార్పు మొదలై ఇలాంటి ఘటనలు రిపీట్ కావని చెప్పుకొచ్చింది రేణు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X